Reporter -Silver Rajesh Medak.
తేదీ :27-3-2024 మెదక్
ఏప్రిల్ 15 ,2024 వరకు 18 సం: నిండిన వారు ఓటరు గా నమోదు చేసుకోవాలి . 100 శాతం ఓటింగే లక్ష్యం . స్వీప్ మెదక్ జిల్లా అధ్వర్యంలో లో ఓటరు అవగాహన పై బైక్ ర్యాలీ
అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో పొందిన మెదక్ జిల్లా.
పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ నమోదులో మొదటి స్థానంలో నిలపాలి.
జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్ జిల్లాలో ఉన్న ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియో గించుకొవలని మెదక్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి/ కలెక్టర్ రాహుల్ రాజ్ , అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు కోరారు. “నేను కచ్చితంగా ఓటు వేస్తాను మీరు కూడా ఓటు వేయండి” అనే నినాదంతో బుదవారం మెదక్ నూతన కలెక్టరేట్ కార్యాలయం నుండి మెదక్ రాందాస్ చౌరస్తా వరకు ఆయా శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది తో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మెదక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి / కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం పండుగ వాతావరణం లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువైనప్పటి నుండి జిల్లాలో అన్ని గ్రామలలో ఓటు హక్కును వినియోగించుకోవాలని అనేక అవగాహన కార్యక్రమలు చేపడతామని పేర్కొన్నారు.
నిష్పక్షపాతoగా, స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా జిల్లాలో ఉన్న ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 18 సంవత్సరాల నిండి కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని సత్తా చాటాల అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.
అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు మాట్లాడుతూ ఓటు ద్వారా చైతన్యం వస్తుందన్నారు. బాధ్యతగా ఓటు హక్కు ను వినియోగించి దేశాన్ని మర్చవచన్నరు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రస్థాయి పోలింగ్ నమోదు లో రెండవ స్థానం రావడం శుభ పరిణామం అని ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో మొదటి స్థానం కోసం ప్రయత్నించా లన్నారు. ఈ కార్యక్రమంలో , జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఏ శ్రీనివాసరావు, డీఈఓ రాధా కిషన్ ,డీ ఎస్పీ డాక్టర్ రాజేష్ , జిల్లా యువజన క్రీడా అధికారి నాగరాజు , DWO ,అధికారి బ్రహ్మాజీ, ఏవో యూనస్ ,జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు, ఎన్నికల సిబ్బంది,జిల్లా అధికారులు పాల్గొన్నారు.