ప్రణాళికాబద్ధంగా యాసంగి ధాన్యం కోనుగోలు చేయాలి…… రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

Reporter -Silver Rajesh Medak. తేదీ 26-3-2024.

*వరికోతల ప్రకారం సకాలంలో ధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

*నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధర పై కోనుగోలు

*ధాన్యం కొనుగోలు కేంద్రాలో అవసరమైన మౌళిక వసతులు కల్పించాలి

*వానాకాలం పంట సీఎంఆర్ రా రైస్ డెలివరీ పై కలెక్టర్ లు ప్రత్యేక దృష్టి సారించాలి

*ధాన్యం కొనుగోలు, త్రాగునీటి సరఫరా పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

యాసంగి 2023-24 ధాన్యాన్ని ప్రణాళిక బద్ధంగా మద్దతు ధర పై కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి ధాన్యం కొనుగోలు, వేసవి త్రాగునీటి సరఫరా ప్రణాళిక పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ , అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు (రెవెన్యూ) తో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ యాసంగి పంట కోతలకు వస్తున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో వరి కోతల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరిస్తూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంటుందని, అధికారులు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం చేయాలని, ఎక్కడ ఎటువంటి ప్రజాప్రతినిధులు పాల్గోనవద్దని అన్నారు.

యాసంగి పంట కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా 7149 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంటుందని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సరఫరా ,టెంట్లు వంటి ఏర్పాట్లు చేయాలని సి ఎస్ అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్యాడ్ క్లీనర్లు, తేమ యంత్రాలు, వెయింగ్ యంత్రాలు, టార్ఫాలిన్ల, గన్ని బ్యాగులు సన్నద్ధం చేసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు, సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్లులకు రవాణా చేసేందుకు అవసరమైన వాహనాలు సిద్ధం చేసుకోవాలని అన్నారు.

చివరి గింజ వరకు నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధరపై ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎక్కడ తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అవసరం లేదనే సందేశం రైతుల వద్దకు వెళ్లేలా అవగాహన కల్పించాలని, భారత ఆహార సంస్థ నిర్దేశించిన ధాన్యం నాణ్యత ప్రమాణాలు, తేమ శాతం పై విస్తృత అవగాహన కల్పించాలని, రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకొని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి సంబంధిత మిల్లర్లకు కేటాయించాలని, రైస్ మిల్లు వద్ద ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కోత రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైస్ మిల్లర్ల వద్ద హమాలీల కొరత రాకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం రైతులు ధాన్యాన్ని తీసుకుని వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

జిల్లాలో వరి సాగు చేస్తున్న రైతులకు సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ట్యాగింగ్ చేయాలని, ప్రణాళిక బద్ధంగా కొనుగోలు కేంద్రం వద్దకు రైతు ధాన్యం తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వానాకాలం 2023-24 కు సంబంధించి సీఎంఆర్ రా రైస్ డెలివరీ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, భారత ఆహార సంస్థ నిర్దేశించిన సమయానికి రైస్ డెలివరీ చేసే విధంగా ప్రతి జిల్లాలో రైస్ మిల్లుల పనితీరును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని, ప్రతిరోజు రైస్ మిల్లులు పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిచేలా చూడాలని, సిఎంఆర్ రా రైస్ డెలివరీ పై కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని సిఎస్ పేర్కొన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమం లో,జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు,జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మ రావు, డి ఎం హరికృష్ణ, అడిషనల్ డి ఆర్ డి ఓ సరస్వతి, డి సి ఓ కరుణ తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!