వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు గంట రవి కుమార్ అధ్యక్షతన నిర్వహించిన వరంగల్ తూర్పు ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారితో కలిసి పాల్గొన్న బీజేపీ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధి అరూరి రమేష్.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజానీకానికి సేవ చేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాననీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు అహర్నిశలు నా గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ కార్యకర్తలను నన్ను నమ్ముకున్న అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుoటానని పార్టీ శ్రేణులను కలుపుకొని ముందుకు వెళ్ళి ఘనమైన విజయాన్ని సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్,కుసుమ సతీష్,తూర్పు నియోజవర్గ పార్టీ డివిజన్ అద్యక్షులు, పదాదికారులు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…