Reporter -Silver Rajesh Medak.
Breaking news.
మెదక్ బిఆర్ఎస్ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజి మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు .
ఎంపీగా వెంకట్రామ రెడ్డి గారిని మంచి మెజార్టితో గెలిపించాలి.
రోజుకు 18 గంటలు కష్టపడే వ్యక్తి. గొప్ప మనసు. అందుకే 100 కోట్లతో పేదల విద్య కోసం ట్రస్ట్ ఏర్పాటు చేస్తా అని ప్రకటించారు.
2 లక్షల రుణమాఫీ అన్నారు మాట తప్పారు.
500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అని మాట తప్పారు.
మహాలక్ష్మి పేరిట 2500 మహిళలకు ఇస్తా అని మోసం చేసారు.
అవ్వా, తాతకు 4వేల పింఛన్ అన్నారు. ఇప్పటికి ఒక్కొక్కరికి 8 వేలు బాకీ పడ్డారు.
రైతుబంధు 15 వేలకు పెంచుతా అని మోసం చేసారు.
కౌలు రైతులకు కూడా ఇస్తామని దగా చేసారు.
కళ్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. మాట తప్పారు.
ఈ హామీలు అమలు చేసే దాకా కాంగ్రెస్ ను నీలాదీయాలి.
ఇక బిజెపి పార్టీ మత రాజకీయాలు చేస్తున్నది.
కసీఆర్ గారు యాదాద్రి నిర్మించారు. అయనకన్నా పెద్ద దైవ భక్తుడు ఎవరు..
ఆదాని, అంబాని తప్ప ఎవరు బాగుపడ్డారు.
రఘునందన్ రావును 50 వేల పైగా ఓట్లతో చిత్తుగా ఓడించారు.
పోరాటం బి ఆర్ ఎస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య
కాంగ్రెస్ హామీలు అమలు కావాలన్నా, ఢిల్లీలో ప్రశ్నించాలన్నా ఎంపీగా బి ఆర్ ఎస్ అభ్యర్థి గెలవాలి.
మోడీ ఎప్పుడు ఉత్తర భారత దేశం వైపే చూస్తారు. కానీ దక్షిణ భారతం వైపు చూడరు.
బిజెపి గెలిస్తే తెలంగాణకు ప్రయోజనం ఉండదు.
అసెంబ్లీలో కేవలం ట్రైలర్ మాత్రమే చూపెట్టామ్, రానున్న రోజుల్లో మొత్తం సినిమా చూపిస్తాం.
చెప్పిన హామీలు అమలు చేసేదాకా వెంటబడతాం, నిలాదీస్తాం.
రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నాడు.
180 మంది రైతులు, 38 మంది ఆటో సోదరులు చనిపోతే కనీసం స్పందన లేదు
మనస్సు లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
డిపాజిట్లు రాని బీజేపీకి మళ్ళీ అదే గతి పడుతుంది.