Reporter -Silver Rajesh Medak. తేది –26-03- 2024.
పోలింగ్ సిబ్బంది మొదటి విడత రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి : జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్.
పోలింగ్ సిబ్బంది మొదటి రాండమైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు రాహుల్ రాజ్ పేర్కొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజెషన్ ప్రక్రియ నిర్వహించి పూర్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవిన్యూ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులను,769 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం 4,164 మందిని మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ సిబ్బందిని కేటాయించడం జరిగిందని అన్నారు.
అందులో 1041 మంది ప్రిసైడింగ్ అధికారులు,1041 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 2082 మంది ఇతర పోలింగ్ అధికారులున్నారు. ప్రతి టీములో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు అదర్ పోలింగ్ ఆఫీసర్లు ఉంటారన్నారు. ర్యాండమైజేషన్ ద్వారా నియమించిన వారికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియలో పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాల వారిగా కేటాయిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ , జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.