పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సభలో పాల్గొన్న మంత్రి దనసరి సీతక్క …

మహాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారి గెలుపు కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలి…

గతంలో బలరాంనాయక్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో రహదారులను, వంతెనలను, కస్తూర్బా, మోడల్ స్కూళ్లను ములుగు నియోజకవర్గానికి తీసుకువచ్చిన ఘనత ఉన్నదని అన్నారు…

కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..

భవిష్యత్ ప్రధాని రాహుల్ గాంధీ గారే అని అన్నారు…

ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం గాంధీల కుటుంబం…

రాజీవ్ గాంధీ గారు మరణించిన దగ్గరి నుండి గాంధీల కుటుంబంలో ఒక్కరూ కూడా ప్రధాని అయ్యే అవకాశం ఉన్న రాహుల్ గాంధీ తృణప్రాయంగా వదులుకున్నారు..

భారత్ జోడో యాత్ర ద్వారా ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకుని దేశంలోని పేదరిక నిర్మూలన లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు రాహుల్ గాంధీ

భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించి త్రివర్ణ పతాక అంగరంగ వైభవంగా ఎగురవేద్దాం…

ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి ఎంపీగా బలరాంనాయక్ గారిని గెలిపించాలని ప్రజలను కోరిన మంత్రి సీతక్క గారు…

మంగళవారం అనగా ఈరోజున గోవిందరావుపేట మండల కేంద్రంలోని కాకతీయ కమ్మ సేవా సంఘంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ గారి అధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించగా అట్టి సమావేశానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి శ్రీమతి దనసరి సీతక్క గారు మరియు మహాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ గారు విచ్చేశారు.

ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ, భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, భారతావని సంకెళ్లు తెంచి భరతమాత నుదిట సింధూరం దిద్దిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ, అటువంటి కాంగ్రెస్ పార్టీ కొందరు నాయకులు విమర్శించడం సిగ్గు చేటు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆర్థిక సంస్కరణలు, పంచవర్ష ప్రణాళికలు, ప్రాజెక్టులు, రాజాభరణాల తొలగింపు, బ్యాంకింగ్ వ్యవస్థ, భూ సంస్కరణల చట్టం, పేదలకు భూములకు పంపిణీ, వ్యవసాయాభివృద్ధి, భారీ, మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పడం, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, లక్ష రూపాయల పంట రుణమాఫీ, ఆహార భద్రత చట్టం, అటవీ హక్కుల చట్టం, ఇందిరా క్రాంతి పథం, డ్వాక్రా రుణాలు, పేద ప్రజల అభివృద్ధి కొరకు ఎన్నో అత్యుత్తమ పథకాలు రూపొందించిన అత్యుత్తమ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు పెంచి, ఇంధనం ధర పెంచి, జి.ఎస్టీ ద్వారా పేదల నడ్డి విరుస్తూ, ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ వ్యక్తుల చేతిలో దేశం యొక్క భవితవ్యాన్ని తాకట్టు పెట్టారని అన్నారు. మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతూ, కావాలని మతం పేరిట మారణహోమం చేస్తూ భారత దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని గద్దెనెక్కిన బీజేపీ పార్టీ, ప్రధాని అయి పదేండ్లు కావోస్తున్నా ఇంతవరకు ప్రతి ఏటా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా దేశం యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నాడని అన్నారు.

తాతల దగ్గరి నుండి ధనిక కుటుంబం అయిన రాహుల్ గాంధీ గారి కుటుంబం ప్రజా సేవా కొరకు వారి డబ్బును పెట్టారు తప్ప, ఇప్పటివరకు సొంత ఇల్లు కూడా లేని వ్యక్తి రాహుల్ గాంధీ గారు అని అన్నారు. దేశానికి ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ గారు కావాలంటే మనమందరం చేతి గుర్తుకు ఓటు వేసి బలరాంనాయక్ గారిని గెలిపించాలని కోరారు. గత 34 యేండ్ల నుండి గాంధీ కుటుంబం నుండి ప్రధాని అయ్యే అవకాశం ఉన్న కూడా తృణపాయంగా వదిలిన కుటుంబం రాహుల్ గారి కుటుంబం అని అన్నారు.

మహాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని, ఇదివరకు కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ములుగు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు అని, ఎన్నో జాతీయ రహదారులు, వంతెనలు, స్కూళ్లు తీసుకువచ్చిన ఘనత బలరాంనాయక్ గారిది అని అన్నారు. నేను మంత్రిగా గెలిచిన మూడు నెలల్లో నియోజకవర్గంలోని ప్రతి మండలానికి 3 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయించా అని, ఇంకా పది కోట్ల రూపాయలు గోవిందరావుపేట మండలంలోని కోటగడ్డ రోడ్డు, దుంపెళ్ళిగూడెం రోడ్డు, రంగాపూర్ రోడ్డు మరియు మండలంలోని అంతర్గత రోడ్ల కొరకు తీసుకువస్తున్న అని, ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున, ఎలక్షన్ కోడ్ ముగియగానే వెంటనే ఆ పనులు ప్రారంభించి ములుగు నియోజకవర్గంలోని ప్రతి రోడ్డు సీసీ రోడ్డు చేసి నిజమైన అభివృద్ధి చేస్తానని అన్నారు.

అందుకు మీరంతా ఏకమై బలరాంనాయక్ గారి చేతి గుర్తుపై ఓటు వేసి అతన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న అని, ఎంపీగా అతను గెలవడం వలన, గిరిజన ప్రాంతాలకు కేంద్రం నుండి నిధులు ఎక్కువగా వస్తాయని, నా చెయ్యికి అతని చెయ్యి కూడా తోడైతే ములుగు నియోజకవర్గం అత్యంత తొందరగా అభివృద్ధి జరుగుతుందని కావున కార్యకర్తలు అందరూ నన్ను ఎలా అయితే భారీ మెజారిటీతో గెలిపించారో అలాగే బలరాంనాయక్ గారిని గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాది రాంరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పాశం మాధవరెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రేగ కళ్యాణి, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, మండల ఉపాధ్యక్షులు తేళ్ల హరిప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెండేం శ్రీకాంత్, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కుర్సం కన్నయ్య, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పులుగుజ్జు వెంకన్న, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి సూదిరెడ్డి జయమ్మ, జంపాల చంద్రశేఖర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు చింత క్రాంతి, మద్దాల నాగమణి, పడిదల సాంబయ్య, భూక్యా రాజు, సూడి సత్తిరెడ్డి, ఎంపీటీసీలు గోపిదాసు ఏడుకొండలు, గుండేబోయిన నాగలక్ష్మి – అనిల్ యాదవ్, చాపల ఉమాదేవి – నరేందర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు రామచంద్రపు వెంకటేశ్వర్ రావు మరియు మండలంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!