-రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి.
-రాష్ట్రం లో మాదిరిగానే కేంద్రములో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.
-2022 వరకు దేశములో ఉన్న పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని గత ఎన్నికల్లో బిజెపి చెప్పు మాట తప్పింది.
-ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఎక్కడ ఇల్లు కట్టిచ్చారో భాజపా నేతలు చెప్పాలి.
-బిజెపి, బిఆర్ఎస్ లకు ఓటు అడిగే హక్కు లేదు.
-అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీ లు అమలు చేశాం.
-బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేశారు.
-మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం.
-మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు 10 లక్షల జీవిత భీమా.
-మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలి.
-కన్నాయి గూడెం మండలం లో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క.
ఈ రోజు ములుగు నియోజక వర్గం లోని గోవిందా రావు పేట మండల కేంద్రములో మండల అధ్యక్షులు పాలడుగు వెంకట కృష్ణ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ ఆధ్వర్యములో జరిగిన మండల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి వర్యులు పోరిక బలరాం నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… గడిచిన 10 సంవత్సరం లో తెలంగాణ ప్రజల ఆస్తులును దోచుకున్నా బిఆర్ఎస్ బిజెపి కి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
నిన్న మొన్నటి నుండి కొంత మంది దుర్మార్గులు నాపైన ప్రచార మాధ్యమం లో సోషల్ మీడియా లో కవల్సుకొని దృషు ప్రచారం చేస్తున్నారు నాపైన ఎంత మంది వేదువలు కుట్ర చేసిన నేను ప్రజా సేవ చేస్తా ఎందుకంటే నేను ప్రజల మనిషిని ప్రజల కష్ట సుఖాల్లో వారితో ఉన్న వ్యక్తిని తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులకు కాలమే సమాధానం చెపుతుంది అని ప్రజల అండ దండలు ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలుకు రూ. 500 గ్యాస్,10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఇందిరమ్మ ఇళ్లు,సీఎం రేవంత్ రెడ్డి గారు దైవ సన్నిధిలో ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు నియోజక వర్గానికి 3500 ఇల్లు మంజూరు చేశామని కెసిఆర్ బారాస ను ఓడించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అందుకే ఇచ్చిన మాట నిలపెట్టుకోవడానికి ఇందిరమ్మ రాజ్యం లో ఇచ్చిన 6 గ్యారంటీ లు అమలు చేశాం మాది ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని 2022 వరకు దేశంలో ఉన్న ప్రతి పేదవారికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఎక్కడ ఇల్లు కట్టిచారో భాజపా నాయకులు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.
2022 నాటికి రైతుల అధ్యాయం రెట్టింపు చేస్తామని మోడీ హామీ ఇచ్చారు కానీ పెట్టుబడి లేక లక్షల మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు కనీస మద్దతు ధర కోసం ఢిల్లీ సరిహద్దులో దీక్షలు చేస్తుంటే మోడీ ప్రభుత్వం రైతుల పై తుపాకుల తుట పేల్చింది రైతులను బలితీసుకుంది భాజపా ప్రభుత్వం కదా ఒక్కసారి దేశ ప్రజలు ఆలోచన చెయ్యాలి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి వర్యులు పోరిక బలరాం నాయక్ ని భారీ మెజార్టీ తో గెలిపించాలని నేను మంత్రిగా బలరాం నాయక్ గారు ఎంపీ గా ఉంటే మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళా సోదరీమణులు పాల్గొన్నారు.