బి.ఆర్.ఎస్.పార్టీకి బిగ్ షాక్..

ములుగు జిల్లా సీఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభ రోజే బి.ఆర్.ఎస్.పార్టీకి బిగ్ షాక్…

రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి, బి.ఆర్.ఎస్.పార్టీ రాష్ట్ర నాయకులు పొరిక జగన్నాయక్, బి.ఆర్.ఎస్.పార్టీ మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్ గార్లు..

తమ అనుచర గణంతో కాంగ్రెస్ పార్టీలో చేరిక…

కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన టీపీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు…

బి.ఆర్.ఎస్.పార్టీలో ఉద్యమకారులకు, కార్యకర్తలకు ప్రాధాన్యత లేదని, రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అని అంటున్న ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు…

తేదీ: 24.11.2023 శుక్రవారం అనగా ఈరోజున ఆలేరులో టీపీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి అధ్యక్షతన మాజీ మంత్రి, బి.ఆర్.ఎస్.పార్టీ రాష్ట్ర నాయకులు పోరిక జగన్నాయక్, బి.ఆర్.ఎస్.పార్టీ ములుగు మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్ గార్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సుమారు 300 మంది తమ అనుచరగణంతో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పోరిక జగన్నాయక్, బాదం ప్రవీణ్ గార్లు, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం పైడాకుల అశోక్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనీ ప్రజలు ఆశీర్వదించాలని, కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్షతోనే కెసిఆర్ కుటుంబం పదవులు, హోదాలు అనుభవిస్తున్నారు అని, బి.ఆర్.ఎస్.పార్టీలో ఉద్యమకారులకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రాధాన్యత లేదని, కల్వకుంట్ల కుటుంబం నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఇప్పటికీ అయిన మేల్కొండి ప్రజలారా మన పిల్లల భవిష్యత్తును దెబ్బతీసిన కెసిఆర్ గారిని ఒడించడమే లక్ష్యంగా ముందుకు సాగుదాం, మరో నిజాంను గద్దె దించడమే లక్ష్యంగా అడుగులు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కెసిఆర్ గారి అవినీతిని అరికడదాం అని అన్నారు. ఓ యువత మేల్కొండి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి నయవంచన చేసిన కెసిఆర్ గారికి బుద్ది చెపుదాం, పండించిన పంటను కూడా అమ్ముకోలేని స్థితికి రైతును తీసుకువచ్చిన ప్రభుత్వ గోడలు బద్దలు కొడదాం, ఓ రైతన్న మేలుకో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రైతు రాజ్యాన్ని నిర్మించుకుందాం అని అన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!