యువజన కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్

ప్రతి యువకుడు చిత్తశుద్ధితో పని చేసి సీతక్క గారి గెలుపుకు కృషి చేయాలని కోరారు…

యువతే భవిష్యత్తుకు పునాది…

ఇంటికో ఉద్యోగం ఏమైంది కెసిఆర్…

నియామకాల పేరుతో యువత భవిష్యత్తును దోచుకున్న కెసిఆర్…

తేదీ: 02.11.2023 గురువారం అనగా ఈరోజున ములుగు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రవి చందర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యువజన నాయకుల సమావేశం ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు విచ్చేసి యూత్ నాయకులు అందరూ ఐక్యతతో ఉంటూ యువత భవిష్యత్తుని నాశనం చేసిన కెసిఆర్ గారిని గద్దె దించేదాక పోరాటం చేయాలని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే మన కొలువులు మనం సాధించుకుందాం అని అన్నారు.

ఈ సందర్భంగా అశోక్ గారు మాట్లాడుతూ యువత భవిష్యత్తుని నాశనం చేసిన కెసిఆర్ గారిని గద్దె దించడమే లక్ష్యంగా, కాంగ్రెస్ పార్టీ గెలుపుకై పోరాటం చేసి మన కొలువులు మనమే సంపాదించుకుని భవిష్యత్తుని నిర్మించుకోవాలని సూచించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అని నమ్మించి మోసం చేశాడని, తెలంగాణ రాష్ట్ర కల కోసం యువత పోరాటాలు చేస్తే పదవులు అనుభవించేది మాత్రం కల్వకుంట్ల కుటుంబం అని అన్నారు. విద్యార్థులకు ఫీజు రీ ఇంబార్సూమెంట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్క యువజన నాయకుడు కూడా చిత్తశుద్దితో పని చేసి సీతక్క గారి గెలుపు కొరకు అహర్నిశలు పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ద్వారా అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ, టి.ఎస్.పి.ఎస్.సి.ని ప్రక్షాళన చేసి మరోసారి పేపర్ లీకు లేకుండా శాశ్వత పరిష్కారం చేస్తాం అని అన్నారు. యువ వికాసం ద్వార విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించి, ఉన్నత చదువులకు 5లక్షల రూపాయలు అందిస్తాం అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ఉద్యమ కారులకు పెన్షన్ అందిస్తామని, ఎస్.ఎస్టీ. బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేస్తాం అని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఒక ఎలక్ట్రిక్ స్కూటీ అందిస్తామని అన్నారు. కావున కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేసి సీతక్క గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువజన రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!