Reporter -Silver Rajesh Medak
సాధారణ ఎన్నికలు 2023 లో బాగంగా స్థానిక YPR ఇంజనీరింగ్ కలశాల లో గురువారం మెదక్ 34, నర్సాపూర్ 37 ,నియోజక వర్గ లా కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ రాజర్షి షా.
పరిశీలించారు .కౌంటింగ్ రోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని,నవంబర్ 15 లోపు కౌంటింగ్ సెంటర్ లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్ నెట్.మీడియా పాయింట్, బారికేడ్లను,విద్యుత్ సరఫరా ,త్రాగునీరు , లాంటి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. కౌంటింగ్ అనంతరం EVM లు, VV ప్యాట్ లను భద్రపరచడానికి పిల్లికోట్యల్ లో నీ పాత జిల్లా కలెక్టర్ కార్యాలయం లో సాద్యసాద్యాలను పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మెదక్ , నర్సాపూర్ ఆర్డీఓలు అంబదాస్ , శ్రీనివాస్, మెదక్, హవేలీఘణపుర్ తహసీల్దార్ లు శ్రీనివాస్ , నారాయణ ఈ ఈ పి ఆర్ నర్సింలు, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు ,సంబంధిత అధికారులు పాల్గొన్నారు . జిల్లా పౌర సంబంధాల అధికారి మెదక్ జిల్లా గారిచే జారీ చేయనైనది.