రైతు బంధు నవంబర్ 2 వరకు ఇవ్వమని చెబుతుంది కాంగ్రెస్ పార్టీ…
ప్రతి ఏటా అక్టోబర్ నెలలో వేసే రైతుబంధు ఈ ఏటా నవంబర్ నెలలో ఇస్తా అనడం ఏంటి..
రైతులకు భూమి పట్టాలు లేవు, పంట రుణాలు లేవు, పోడు పట్టాలు లేవు, గిట్టుబాటు ధర లేదు, సబ్సిడీ ఎరువులు లేవు, ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం లేదు…
రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల పంట రున మాఫీ చేసింది కాంగ్రెస్ పార్థ అని అన్నారు.
ఎవరు నిజమైన రైతు వ్యతిరేకి తెలుసుకోవాలి బి.ఆర్.ఎస్.పార్టీ నాయకులు…
దళిత ముఖ్యమంత్రి చేస్తానని నమ్మించి మోసం చేసిన కెసిఆర్..
దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తానని చెప్పి మోసం చేసిన కెసిఆర్…
గత సంవత్సరం నుండి దళిత బంధు ఇస్తా అని ఊరించి ఎన్నికలు వచ్చేంత వరకు సాగదీసి ఇప్పుడు ప్రతిపక్షాల పైన నెట్టడం ఎంత మూర్ఖత్వం…
రాజ్యాంగం బద్దంగా కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది…
ఎన్నికల ముందు ఎన్నికల కోడ్ పడుద్ది అని తెల్వదా బి.ఆర్.ఎస్.నాయకులకు…
ఇంకోసారి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఊరుకునేది లేదని బి.ఆర్.ఎస్.పార్టీ నాయకులను హెచ్చరించిన గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ గారు…
తేదీ: 27.10.2023 శుక్రవారం అనగా ఈరోజున గోవిందరావుపేట మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్ గారి ఆధ్వర్యంలో మండల ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ గారు విచ్చేసి బి.ఆర్.ఎస్.పార్టీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే, ప్రజలకు లబ్ధి చేయాలని ఆశిస్తే ఎన్నికల కోడ్ కంటే ముందే ఎందుకు లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేయలేదు అని, ఇంకోసారి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఊరుకునేది లేదని, కాంగ్రెస్ పార్టీలో ఓనమాలు నేర్చుకుని, నిన్న, మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు కట్టిన బి.ఆర్.ఎస్.పార్టీ నాయకులు కూడా ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేవారు అయ్యారా అని, నిజంగా వారికి సిగ్గు ఉంటే మాట్లాడరు అని అన్నారు.
ఈ సందర్భంగా వెంకటకృష్ణ గారు మాట్లాడుతూ రైతు వ్యతిరేకి, దళిత వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అని అంటున్న బి.ఆర్.ఎస్.పార్టీ నాయకులకు నిజంగా సిగ్గు ఉండాలి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ భూసంస్కరణల చట్టం తెచ్చి దళితులకు భూములు పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందని, ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ముఖ్యంగా లబ్ధి చేకూరింది దళితులకు అని అన్నారు. నిజమైన దళిత వ్యతిరేకి కెసిఆర్ గారని 2014 ఎన్నికల్లో దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి తెలంగాణ రాష్ట్ర దళితులను మోసం చేశాడు అని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మరొకసారి దళితులను మోసం చేశాడని, అలాగే గత సంవత్సరం నవంబర్ నుండి ఇప్పటివరకు 11నెలల నుండి డలితబందు రెండో విడత ఇస్తానని చెప్పి నమ్మించి, ఎన్నికల సమయం వరకు కాలాన్ని వృధా చేసి, ఎన్నికల కోడ్ వచ్చింది అని, ప్రతి పక్షాలు అడ్డుకుంటున్నాయి అని చెప్పడం సిగ్గు చేటు అని అన్నారు. ఇకనైనా నిజమైన దళిత వ్యతిరేకి ఎవరు అనేది ప్రజలకు తెలుసు అని, ముందు నువ్వు తెలుసుకోవాలి అని అన్నారు.
అలాగే రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అని చెప్పే నీచమైన నాయకులకు కొందరికి తెలియాలి, వర్షపు నీటిని అదుపు చేయడానికి, కుంటలు తవ్వించి, చెరువులకు మరమ్మత్తులు చేయించి, నదులకు ప్రాజెక్టులు కట్టి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతులకు భూములకు పంపిణీ చేసింది కాంగ్రెస్ పార్టీ అని, రైతులకు ఏకకాలంలో పంట రుణమాఫి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అని అన్నారు. అలాగే సాగు చేసుకునే ప్రతి రైతుకు రైతు గిడ్డంగులు కట్టించి, దళారుల చేతిలో మోసపోకుండా రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ అని, నేడు బి.ఆర్.ఎస్. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పండించిన పంటను కూడా అమ్ముకొలేని దీన స్థితిలో రైతు ఉన్నాడంటే కారణం కెసిఆర్ సర్కారు అని అన్నారు. రైతుబంధు ప్రతి ఏటా అక్టోబర్ నెలలో రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రభుత్వం ఈ సారి ఎందుకు వేయలేదు, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అనే సోయి లేదా బి.ఆర్.ఎస్.పార్టీకి, ఎందుకు వెయ్యలేదు అని ప్రశ్నించారు. దేశానికి వెన్నుముక అని రైతన్న, మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కెసిఆర్ గారు మొన్న వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఎందుకు నష్టపరిహారం అందించలేదని అన్నారు. ఇప్పటికీ అయిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనే కొందరు అధికార పార్టీ నాయకులు ముందు కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని, కాంగ్రెస్ పార్టీ గురించి నాలుకకు ఎంత వస్తే అంత మాట్లాడితే వాతలు పెడతామని అన్నారు. ముందు మీ అధికార పార్టీ నాయకుల దగ్గర బాంచన్ గిరి చేయకుండా, జరంత ప్రజల సమస్యలపై మాట్లాడాలి అని, ప్రభుత్వం నుండి నిధులు తెప్పించలని హెచ్చరించారు. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ రాజకీయ ఓనమాలు నేర్చుకుని, జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్ గురించి విమర్శించడం నిజంగా సిగ్గు చేటని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.