చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య గారి ప్రజా ఆశీర్వాదయాత్ర యాత్రలో పెద్దఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, మహిళలు
మంగళహారుతులతో స్వాగతం పల్లెపల్లెన ప్రభుత్వ పథకాల ప్రచారం
చేవెళ్ల నియోజకవర్గంలో చేవెళ్ల మండలం ఉరెళ్ళ, మొండి వాగు, దేవుని ఎర్రవెల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే కాలే యాదయ్య గారికి ప్రజా ఆశీర్వాద యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది.
యాదన్న కు మహిళలు మంగళహారతులు ఘనస్వాగతం పలికారు.
అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగిద్దాం…
ఆశీర్వదించండి: ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు వివరించారు. కాంగ్రెస్ నేతలు 70 ఏళ్లుగా మాయ మాటలు చెబుతూ అధికారంలో కొనసాగారు తప్ప..ప్రజలకు ఎలాంటి మేలు చేకూర్చలేదని ఎమ్మెల్యే యాదయ్య మండిపడ్డారు. ఎన్నికల ముందు మాత్రమే ప్రజల ముందుకు వచ్చి అఢ్డగోలు హామీలు ఇస్తూ మోస గించడమే వారి లక్ష్యం అన్నారు, గత పాలకులు షూరిటీ ఉన్న వారికే ప్రభుత్వ రుణాలు అందించే వారని…ఏ కొందరికో ప్రభుత్వ పథకాలు దక్కేవన్నారు. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి షరతులు లేకుండానే అర్హులకు రుణాలు అందించడమే కాకుండా.. ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎవరు ఏ రంగంలో స్థిరపడాలనుకుంటే వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి అవకాశం కల్పించారని ఎమ్మెల్యే యాదన్న గారు అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా కేసీఆర్ కు బాసటగా నిలిచారని.. రాబోయే ఎన్నికల్లోనూ మరోసారి అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా దళిత వర్గాల అభ్యున్నతి కోసం దళితబందు లాంటి పథకం అమలు చేసి అభివృద్ధి పరిచారన్నారు. దళితులు వారి జీవితాల్లో వెలుగులు నింపుకున్నారని చెప్పారు. రకరకాల వ్యాపారాలు ప్రారంభించి.. పది మందికి ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. రాబోయో తొమ్మిదేళ్లలో రాష్ర్టంలోని దళితులందిరికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేస్తుంటే ప్రోత్సహించాల్సింది పోయి.. తమ స్వలాభం కోసం లేని పోని..పసలేని విమర్శలు చేయడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. దళితబందు అనేది ప్రతీ ఒక్కరికి అందుతుందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. దళితబందు ఒక గొప్ప కార్యక్రమమని.. ఎన్నికల కోసం అమలు చేస్తున్న పథకం కాదన్నారు. మరో వైపు ఇళ్లు లేని వారి కోసం గృహలక్ష్మి పథకం ద్వారా ఇళ్లు కట్టిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రజలను తప్పు దోవ పట్టించాలనుకుంటే అది ఎవరి వల్ల కాదన్నారు. రైతులకు అవసరమైన విద్యుత్, నీళ్లు అందించిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని.. ఇదే విషయం గ్రామాల్లో ఏ ఒక్కరిని అడిగినా చెబుతారన్నారు. అంతేకాదు.. పెన్షన్లు, ఇచ్చి రోడ్డు వేసి గ్రామాలను అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం అని ఘంటాపథంగా చెబుతారన్నారు. కాంగ్రెస్ నేతలు కేవలం పదవులకోసం పాకులాడుతున్నారు తప్ప.. ప్రజా క్షేమాన్ని కాదన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తామంటే ఎవరు నమ్ముతారని ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రశ్నించారు. వాస్తావాలు చెప్పే వారి మాటలు మాత్రమే ప్రజలు విశ్వసిస్తారని చెప్పారు. కేవలం ఎన్నికల కోసం రైతు బంధు పథకాన్ని ఆపాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాసి కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుందని అన్నారు.అధికారం మీద తప్ప కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద గానీ, వ్యవసాయం మీద గానీ ప్రేమ లేదు. కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట మునగడం ఖాయం అని అన్నారు.కాంగ్రెస్ పెట్టాదు కెసిఆర్ సార్ ఇస్తుంటే ఓరువదు…రైతు బంధు ను బంద్ చేయాలంటున్న కాంగ్రెస్ రాబందులు…కర్ణాటక నీ నాశనం చేసారు.. తెలంగాణ ప్రజల మీద రక్కసి ల పిక్కొని తినడానికి రెడీ గా ఉన్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ BRS పార్టీని ఆశీర్వదించాలని గ్రామస్తులను కోరారు…