జోగులాంబ- ప్రతినిధి:-
బాలానగర్:-మటన్ ముక్క గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి చెందిన ఘటన బాలానగర్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం మామిడిగుట్ట తండాకు చెందిన బాలుడు మున్నా (13) ఇంట్లో తింటుండగా మటన్ ముక్క గొంతులో ఇరుక్కుంది. బాలుడికి ఊపిరాడక పోవడంతో కుటుంబీకులు వెంటనే షాద్ నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి ఇప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.