జిల్లా పోలీసు కార్యాలయం,
మెదక్ జిల్లా. 26.10.2023.
పోలీస్ ఫ్లాగ్ డే.. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగలను స్మరిస్తూ మెదక్ జిల్లా ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ ఆదేశానుసారం ఈ రోజు మెదక్ జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ శ్రీ.ఎస్. మహేందర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఏ.ఆర్ హెడ్ క్వాటర్ లో మరియు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ.. పోలీస్ శాఖ పనితీరు, వివిధ అంశాలపై విధ్యార్ధిని, విద్యార్థులకు అవగాహన కల్పించాలని జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన విధ్యార్ధిని, విద్యార్థులకు జిల్లా ఏ.ఆర్ హెడ్ క్వాటర్ లో మరియు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన సుమారు 1000 మంది విద్యార్థులు హాజరయ్యారు అన్నారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో విద్యార్థులకు వివరించిన విషయాలు…
ఫ్రెండ్లీ పొలిసింగ్ విధానం ద్వారా ప్రజలకు దగ్గర అవుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం డే/నైట్ బీట్స్, పెట్రోలింగ్ వ్యవస్థలు ఏవిధంగా పనిచేస్తాయి.
పోలీసు శాఖ నేరస్తులను సులువుగా గుర్తించడం కోసం అభివృద్ధి చేసిన ఫేస్ రికగ్నిషన్ సిస్టం, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వంటి నూతన సాంకేతికతల గురించి వివరించారు.
నేరాలు జరగకుండా నివారించడంలో మరియు జరిగిన నేరాన్ని త్వరగా చేదించడం లో సి.సి కెమెరాలు ఏవిధంగా ఉపయోగపడతాయి.
మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం ఏర్పాటయిన షీ టీమ్ లు, భరోసా సెంటర్ ఏవిధంగా పని చేస్తాయి.
పోలీస్ శాఖ ఉపయోగించే ఆయుధాలు, వాటి పనితీరు, ఏ సందర్భాలలో ఉపయోగపడతాయి అని వివరించడం జరిగింది.
డాగ్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్స్ ఏ విదంగా బాంబులను నివృత్తి చేస్తుంది,
ట్రాఫిక్ రూల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, స్పీడ్ గన్ వినియోగం, బాడి ఓన్ కెమెరాల యొక్క పని తీరును వివరించడం జరిగింది. సైబర్ నేరాలగురించి ఏవిధంగా అప్రమత్తంగా వుండాలి, ఆన్లైన్ లో అపరిచితులతో పరిచేయాలకు దూరంగా ఉండాలని, ఏదైనా సైబర్ క్రైమ్ కు గురి అయినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేసి మీ యొక్క ఫిర్యాదు నమోదు చేయాలని వివరించడం జరిగింది. డయల్ 100 యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది.
FIR నమోదు వివిద సెక్షన్ లను వివరించడం జరిగింది.
పై విషయాలకు సంబంధించి అర్మోరర్లు, బాంబ్ స్క్వాడ్ టీం, ట్రాఫిక్ సిబ్బంది, IT Core, షీ టీమ్, భరోసా సిబ్బంది మరియు తదితరులు విద్యార్థులకు పోలీస్ శాఖ పని తీరును వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ శ్రీ.ఎస్. మహేందర్ తో పాటు మెదక్ డి.ఎస్.పి శ్రీ.ఫణీంద్ర ,ఆర్.ఐ.లు శ్రీ.నాగేశ్వర్ రావ్,శ్రీ.అచ్యుత రావ్,మెదక్ పట్టణ సి.ఐ.శ్రీ.వెంకట్,ఎస్.ఐ.శ్రీ.పోచయ్య, ఆర్.ఎస్.ఐ శ్రీ.నరేశ్ , అర్మోరర్లు .సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ శ్రీ.సుధాకర్,జిల్లాలోని అన్నీ పోలీస్ స్టేషన్ ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.