రంగారెడ్డి జిల్లా : చేవెళ్ల మండల పరిధిలోని రామన్న గూడ గ్రామంలో బుధవారం గ్రామ పాఠశాలలో పరమన్న చారిటబుల్ ట్రస్టు అధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు క్రీడా సామగ్రి మరియు నోట్ బుక్స్ ను పెద్దోళ్ల దయాకర్ పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా పెద్దోళ్ల దయాకర్ మాట్లాడుతూ… ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు. దాతలు ఇస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు సుజాత , శ్రీదేవి , లక్ష్మి , చేవెళ్ళ బి.ఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దోల్ల ప్రభాకర్ , పెద్దోల్ల మోహన్ , పెద్దోల్ల శ్రీకాంత్ , పెద్దోల్ల మహేందర్ , పెద్దోల్ల గోపాల్ ,పెద్దోల్ల వెంకటేష్ , నడిమోల్ల విద్యా సాగర్ , నడిమోల్ల రవి ప్రసాద్ , కల్పగురి మహేందర్ ,పెద్దోల్ల అంజయ్య , పెద్దోల్ల శ్రీనివాస్ , పెద్దోల్ల ప్రవీణ్ , పెద్దోల్ల శ్రీధర్ , పెద్దోల్ల సుధాకర్ , శ్రీరాములు , శ్రీశైలం , ఫరీద్ , పోచయ్య , అనిల్ , అంజయ్య , నాగరాజు , బాబు , పుల్లయ్య , పాఠశాల విద్యార్థులు , గ్రామస్తులు , యువకులు , తదితరులు పాల్గొన్నారు .