జాతీయ జెండాల విక్రయం
స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 08, మహానంది:
మహానంది మండల పరిధిలోని గాజులపల్లి, తిమ్మాపురం సబ్ పొస్టాఫీస్ ల లో జాతీయ జెండాలను విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు పోస్టల్ శాఖ సబ్ పోస్ట్ మాస్టర్లు రాజేశ్వరి, రామ్ నాధ్ లు తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ ఆగస్టు 15 సందర్బంగా ప్రతి ఒక్కరికి జాతీయ జెండాలు అందుబాటులో వుండేవిదంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామాలలోని బ్రాంచ్ పొస్టాఫీస్ లలో కూడా అందుబాటులో వుంటాయని తెలిపారు.ఒక్క జెండా 25 రూపాయలకు విక్రయించేలా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు పోస్ట్ ఆఫీసులలో పంద్రాగస్టు జెండాలను కొనుగోలు చేయాలని కోరారు.