బసాపురంలో ముగిసిన లాల్ షా వలి స్వామి జార్తులు
స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 09, మహానంది:
మహానంది మండలం బసాపురం గ్రామంలో లాల్ షా వలి స్వామి జార్తులు వేడుకలు వైభవంగా నిర్వహించారు.కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు, ఆధ్వర్యంలో లాల్ షా వలి స్వామివారికి ప్రత్యేక ఫాతెహాలు, గంధాన్ని సమర్పించారు.మొహరం పండుగ ముగిసిన పదకొండు రోజులకు మౌలాలి స్వామి జార్తులు వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. . భక్తులు స్వామివారికి పూల సూచికలు, కానుకలు సమర్పించుకున్నారు.రాత్రి నుండి ఉదయం వరకు స్థానికులే కాక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.ఈ జార్తులో ఎన్నో సంవత్సరాలుగా ఒక వింత ఆచారం చోటుచేసుకుంది.అదేమిటంటే నిరుడు ఏడాది భూమిలో పాతిపెట్టిన కొబ్బరికాయను, ఈ సంవత్సరం తీసి , అదే స్థానంలో మరొక కొత్త కొబ్బరికాయను పెట్టడం జరుగుతుంది. సంవత్సరం గడిచిన కూడా కొబ్బరికాయ అలాగే ఉండటం స్వామి వారి మహత్యము అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సన్నివేశం చూడ్డానికి ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని వీక్షించడం జరుగుతుంది. లాల్ షా వలి స్వామి పీరు ఊరేగింపులో భక్తులు,ప్రజలు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.