సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలిసిన టీటీడీ నూతన ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి

అమరావతి ( స్టూడియో 10 న్యూస్ )
సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని టీటీడీ పాలకమండలి నూతన ఛైర్మన్‌ గా నియమితులైన తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్‌ రెడ్డి కలిసి టీటీడీ ఛైర్మన్‌గా తనకు అవకాశం కల్పించినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకము వుంచి ఈ భాధ్యతను అప్పగించడం పట్ల కృతజ్ఞత తెలుపుతూ, అందరి సహకారంతో టిటిడి అభివృద్దికి కృషి చేస్తానన్నారు. గురువారం తిరుమలలో టీటీడీ చైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టనున్నట్లు భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఎంని కలిసిన వారిలో భూమనతో బాటు ఆయన తనయుడు తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌ రెడ్డి కూడా వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!