ఘనంగా జన్మదిన వేడుకలు

వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవన్ ఆవరణలో పి డి ఎస్ యు వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు పీరంపల్లి నరసింహ తన జన్మదిన వేడుకలను పలువురు విద్యార్థి సంఘాల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలతో ప్రజలను జాగురత చేస్తామన్నారు. వికారాబాద్ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపై ఖండిస్తూ రాబోయే ఎన్నికల్లో పాలకవర్గాలకు తగిన గుణపాఠం చెప్తామన్నారు. వైన్ షాపులకు 15 రోజులు గడువు ఇచ్చి గృహలక్ష్మి పథకానికి మూడు రోజులు గడువు ఇచ్చి అమాయకపు ప్రజల ఆశలను అడ్డుపెట్టుకొని ఓట్లు వేటలో ఉన్న పాలకవర్గాలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే కాంట్రాక్టర్ నాగేశ్వరరావు, ఓయూ జేఏసీ నాయకులు సురేష్, యాదయ్య మధు శ్రీనివాస్ నర్సింలు ఆనంద్ రాజు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
………….

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!