రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన గృహ లక్ష్మీ పథకం దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచాలని చేవెళ్ల మండల్ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సోషల్ మీడియా ఇంచార్జ్ కందికొండ మహేందర్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకతీతంగా ఇంటి స్థలం ఉండి అర్హులైన వారందరికీ మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఇచ్చిన హామీలే నెరవేర్చని ప్రభుత్వం కేవలం ఎన్నికల సమయంలో ఓటమి భయంతోనే ఈ పథకాలను ప్రవేశపెడుతుందని దీనిని ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ లక్ష్మీ పథకం దరఖాస్తుల పొడగింపు ఈనెల చివరి వరకు పొడిగించాలని డిమాండ్ చేయాలి.
