లక్ష్యాన్ని చేదించిన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉన్నతాధికారులు
స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 11, మహానంది:
ఉన్నతాధికారులు ఇచ్చిన లక్ష్యాన్ని 2023 -24 సంవత్సరానికి గాను రూ .30. 39 కోట్లు డిపాజిట్లుగాను నిర్దేశించగా రూ .30. 75 కోట్లు చేరుకున్నట్లు తిమ్మాపురం మేనేజర్ ఎస్. సుధీంద్ర కుమారి తెలిపారు. ఆమె సిబ్బందిని అభినందిస్తూ మిఠాయిలు తినిపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బ్యాంకు నుంచి ప్రజల, రైతుల యొక్క ఆర్థిక పురోగతిని మరింత పెంచేందుకోసం రూ .34. 6 9 కోట్ల లక్ష్యం ఉండగా ఇప్పటికీ రూ. 35. 02 కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు.అదేవిధంగా ఎక్కడా లేని విధంగా తమ ఏపీజీబీ నందు డిపాజిట్ల పైన ఆరు పాయింట్ 6.85% వడ్డీని ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే సిరి -400, సిరి- 600 పథకాల్లో భాగంగా కూడా 7.2 7.25 ఇస్తున్నట్లు తెలిపారు పి ఎం జె జె వి వై, పి ఎం ఎస్ వి వై, ఏపీ వై, సోషల్ సెక్యూరిటీ స్కీమ్ లలో కూడా మంచి వడ్డీని అందజేస్తున్నట్లు వివరించారు. ప్రజలు తమ బ్యాంకు ద్వారా రుణాలను పొంది వారి జీవిత లక్ష్యాలను సులభతరమైన వాయిదాలతో చెల్లింపులు జరుపుకొని మరింత ఉన్నతికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ గౌరీ, ఫీల్డ్ ఆఫీసర్ ధరణి, క్యాషియర్ శ్రీకాంత్ ,బ్యాంకు సహాయకులు డి. చంద్రమౌళీశ్వరుడు, డి .పెద్ద శివుడు పాల్గొన్నారు.