పోలీసు సేవల క్యూఆర్ కోడ్ ఆఫ్ సిటిజెన్ లో అన్ని జిల్లాల్లో ఉత్తమ జిల్లాగా మెదక్ జిల్లా ఎంపిక రాష్ట్రం లోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నర్సాపూర్.. జిల్లా ఎస్పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్
స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా : పోలీసుల పనితీరు పోలీసులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ జనవరి 09 2025 తేదిన క్యూఆర్ కోడ్ ఆఫ్ సిటిజెన్ ను రాష్ట్ర DGP.జితేందర్ ఐపీఎస్ చేతుల మీదగా ఆవిష్కరించారు. జనవరి నుండి ఇప్పటివరకు ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగాఅన్ని జిల్లాలకు ర్యాంక్ ను పొందుపరచడం జరిగింది. అందులో జిల్లాలో మెదక్ జిల్లా మొదటి స్థానం ఎంపీక కావడం అభినందనీయమని జిల్లా ఎస్పీ అన్నారు.డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్టిఫికేషన్ కార్యక్రమంలో మెదక్ జిల్లా నుండి అదనపు ఎస్పీ.ఎస్ మహేందర్ రాష్ట్రడిజిపి చేతుల మీదగా సర్టిఫికెట్ను అందుకోవడం జరిగింది అని అన్నారు.సిటిజన్ ఫీడ్ బ్యాక్ లో రాష్ట్రంలోనే 10 ఉత్తమ పోలీస్ స్టేషన్ లో మెదక్ జిల్లాకు చెందిన రెండు పోలీస్ స్టేషన్లు ఉండడం మెదక్ జిల్లా పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలకు నిదర్శనమని అన్నారు.అందులో నర్సాపూర్ పోలీస్ స్టేషన్ కి 1 స్థానం మరియు తూప్రాన్ పోలీస్ స్టేషన్ కు 4వ స్థానం పొందడం జరిగింది ఆయా పోలీస్ స్టేషనులకు చెందిన SHO లు నర్సాపూర్ ఎసై.లింగం మరియు తూప్రాన్ ఎసై.శివానందం సర్టిఫికెట్ను రాష్ట్ర.డిజిపి జితేందర్ చేతుల మీదగా అందుకోవడం జరిగింది. అదేవిధంగా ఫోక్సో కేసులలో IO గా ఉండి 60 రోజుల లోపే ఎక్కువగా చార్జ్ షీట్లను వేసినందుకు గాను తూప్రాన్ డిఎస్పి.ఎస్.వెంకట్ రెడ్డికి రాష్ట్రంలోనే రెండో స్థానం పొంది అడిషనల్ డీజీపీ.అనిల్ కుమార్ చేతుల మీదగా సర్టిఫికెట్ను అందుకోవడం జరిగింది.