ఆపరేషన్ సిందూర్
మెదక్ పట్టణంలో బిజెపి నిర్వహించిన తిరంగా యాత్ర
హాజరైన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు
స్టూడియో 10 టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:
ఆపరేషన్ సిందూర్‌తో భారత సైన్యం చూపెట్టిన పరాక్రమాన్ని ధైర్య సాహసాలను కీర్తిస్తూ భారత సైనిక చర్య విజయానికి మద్దతుగా పట్టణంలోని గుల్షన్ క్లబ్ నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వరకు (రాందాస్ చౌరస్తా) మెదక్ జిల్లా బిజెపి నిర్వహించిన తిరంగా యాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మరియు మాజీ అధ్యక్షుడు చోల రామ్ చరణ్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మెదక్ జిల్లాలోని అన్ని సంఘాలు నాయకులు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.