తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో అర్హులైన నిరుపేదలు గృహాలక్ష్మి పథకం అందాలని ఆశగా ఎదురుచూస్తున్నారని శనివారం మీడియా ప్రకటనలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన యువకులు అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఎంతోమంది నిరుపేదలు జన్మకాలం నుంచి తమ తమ పల్లె గ్రామాల్లో తమకు ఉన్న స్తోమతతో రేకులు,పెంకులు,చుట్టుపక్కల తడకలు,మట్టి గోడలు ఇలా ఆసరాగా తీసుకుని పెట్టుకుని బతుకుతున్నారు. మరికొందరు పొట్టకూటి కోసం పలు పట్టణాలు దేశాలు విడిచి బతుకు దేరువు కోసం అద్దెకు,కిరాయికి ఉంటూ నివాసం ఉంటున్నారన్నారు.కాగా ఇళ్లులేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం తీసుకొచ్చింది.సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ప్రభుత్వం రూ.3మూడు లక్షల ఆర్థిక సాయం చేయనుంది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల కోసం ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. అర్హులైన వారు ఈనెల 10వ తేదీలోగా ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.ఈ మేరకు జిల్లాలో లబ్ధిదారులు ఆగమేఘాల మీద దరఖాస్తులు చేసుకున్నారు.ఎంతోఆశగా ఎదురుచూస్తున్నారు. అర్హులైన నిరుపేదలకు ఈ పథకం వర్తింపజేయాలని ఏలాంటి అవకతవకలకు తావు లేకుండా అధికారులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుని అర్హులైన గృహాలక్ష్మి లబ్ధిదారులకు ఈ గృహాలక్ష్మి పథకం అందేలా చూడాలని కోరారు.