చిన్నారిని కాపాడిన పోలీస్ సిబ్బందికి నగదు రివార్డులు.
_ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గౌతమి గోదావరి వంతెన పట్టుకుని వేలాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారిని రక్షించిన నేషనల్ హైవే పోలీస్ సిబ్బందికి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్.శ్రీధర్ నగదు రివార్డులను అందజేసి అభినందించారు. ఈనెల 6వ తేదీన తెల్లవారుజామున రావులపాలెం నుండి జొన్నాడ వైపు వెళ్లే గౌతమి గోదావరి వంతెన పై ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారిని కాపాడిన విషయం విధితమే.ఈ సంఘటనలో ఆలమూరు మండలంలోని జొన్నాడ హైవే పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది అయిన హెడ్ కానిస్టేబుల్ ఎస్.వి.వి సత్యనారాయణ, హోంగార్డ్ వెన్నెటి సాయి కుమార్ కలిసి కీలక పాత్ర పోషించారు. పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించేందుకు చేసే ప్రతి మంచి పనికి పోలీసులకు రివార్డులను అందజేస్తామని జిల్లా ఎస్పీ తెలియజేశారు.ఈ సందర్భంగా పలువురు వారిని అభినందించారు._