తెలంగాణలో కొన్ని అసెంబ్లీ స్థానాలకు అధికార బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లు వస్తున్న వార్తల అవాస్తవం వడ్ల నందు

బీఆర్ఎస్ మొదటి దఫా అభ్యర్థుల ను ఖరారు చేసినట్టు వస్తున్న సమాచారం అవాస్తవం – బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ,వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ వడ్ల నందు

వికారాబాద్: తెలంగాణలోని కొన్ని అసెంబ్లీ స్థానాలకు అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినట్టు కొన్ని మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ,వడ్ల నందుఫౌండేషన్ చైర్మన్- వడ్ల నందు అభిప్రాయపడ్డారు. శనివారం సోషల్ మీడియాలో అధికార బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినట్టు వస్తున్న సమాచారం పూర్తిగా వాస్తవ విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారికంగా పార్టీ ఎక్కడ కూడా అభ్యర్థులను ఖరారు చేసినట్టు చెప్పలేదని ఈ విషయంలో పార్టీ నాయకులు గానీ కార్యకర్తలు గాని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం నుండి అధికారికంగానే పార్టీ అభ్యర్థుల జాబితా నిలబడుతుందని ఈ విషయంలో వచ్చే అవాస్తవాలను గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం అధికారికంగా అభ్యర్థులను ఖరారు చేస్తుందని ఆయన తెలిపారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!