తిరుపతి :జూన్ 27
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. ఇక వీకెండ్ అయితే చాలు ఆ సంఖ్య మరింత గణనీయంగా పెరుగుతుంటుంది. తాజాగా ఈరోజు మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య సాధారణంగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం మొత్తం 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 9 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. నిన్న సోమవారం శ్రీవారికి హుండీ ద్వారా 4.29 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది. అలాగే నిన్న శ్రీవారిని 73156 మంది భక్తులు దర్శించుకున్నారు. దాదాపు 28175 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు…