భారత జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ గురించి అందరికీ తెలిసిన విషయమే. ధోనికి ఉండే క్రేజ్ గురించి మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఇటీవల జరిగిన ఐపీఎల్‌లోనూ మరోసారి రుజువైంది. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఏ స్టేడియంలో జరిగినా.. స్టాండ్స్ అన్నీ ఎల్లో కలర్‌లోకి మారిన విషయం తెలిసింది. ఉత్కంఠగా జరిగిన ఫైనల్‌లో సీఎస్‌కేను విజేతగా నిలిపాడు. అయితే, ధోనిని చాలా మంది సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటారు. ఏం చేసినా అది కొద్ది క్షణాల్లోనే వైరల్ అవుతుంటుంది. అలాంటి తాజాగా ఓ ఘటన జరిగింది. ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ధోని క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ కనిపించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఈ వీడియో వైరల్ అయిన కొద్ది గంటల్లోనే లక్షలాది మంది డౌన్‌లోడ్ చేయడం మొదలు పెట్టారు. దాదాపు మూడు గంటల్లో దాదాపు 36లక్షల మందికిపైగా ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేశారు. దీన్ని బట్టి ధోని క్రేజ్ ఎలా ఉందో తెలిసిపోతుంది.అయతే, ఒక్కసారిగా తమ గేమ్‌కు సంబంధించి డౌన్‌లోడ్స్ భారీగా పెరడంతో క్యాండీ క్రష్ ఆశ్చర్యపోయింది. ఉన్నట్లుండి డౌన్‌లోడ్స్ భారీగా పెరగడానికి కారణాలు అన్వేషించింది. ఈ విషయంపై ఆరా తీస్తే ట్విట్టర్‌లో మహేంద్ర సింగ్ ధోని గేమ్ ఆడుతూ కనిపించడం కనిపించింది. దాంతో కంపెనీ మహేంద్ర సింగ్ ధోనికి ధన్యవాదాలు తెలిపింది.
మూడు గంటల్లో 3.6మిలియన్లకుపైగా డౌన్‌లోడ్స్ జరిగాయని, థ్యాంక్స్ టూ ఇండియన్ క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని.. మీ కారణంగానే ప్రస్తుతం తాము భారత్‌లో ట్రెండింగ్‌లో ఉన్నామంటూ ట్వీట్ చేసింది. ఇప్పటికీ ధోనికున్న క్రేజ్‌ను చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. గంటల వ్యవధిలో క్యాండీ క్రష్ ఓనర్స్‌ను కుబేరులను చేశాడని కొందరు నెజిటన్లు కామెంట్స్ చేయగా.. ఈ సారి ధోనిని ఎన్నికల్లో నిలబెడితే ప్రధాని కూడా అవుతాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
అయితే, ధోని ఏం చేసినా ట్రెండింగ్‌గా మారుతుంది. ఇటీవల భగవద్గీత పుస్తకంతో కనిపించగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. ధోనీ ఇటీవల మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం క్రికెటేతర కార్యక్రమాల్లో బిజీగా ఉండగా.. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంటాడు. ఈ ఏడాది భారత్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టుకు మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తున్నది.