ఆలమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం బాటిల్లు ధ్వంసం.*

*ఆలమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం బాటిల్లు ధ్వంసం.*

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ వారి ఉత్తర్వులు మేరకు అమలాపురం ఎస్ఇబి అసిస్టెంట్ స్పెషల్ ఇన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వి.శివరామకృష్ణ సమక్షంలో ఆలమూరు మండలం స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో పట్టుబడిన అక్రమ మద్యం బాటిల్లను బుధవారం ద్వంసం చేసినట్లు ఎస్సై ఎస్.శివప్రసాద్ తెలిపారు.ఈ మేరకు వారు తెలిపిన వివరాలు ప్రకారం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ మద్యం) 180 ఎమ్ఎల్ బాటిల్స్ 1860, డ్యూటీ పెయిడ్ లిక్కర్ కి సంబంధించిన 180,750 ఎమ్ఎల్ బాటిల్స్ 75 మొత్తం కలిపి 60,430 రూపాయలు విలువగల బాటిల్స్ ను పోలీస్ స్టేషన్ ఆవరణ నందు అధికారులు సమక్షంలో ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యాన్ని తరలించి, విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవనివారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీబీ పోలీస్, పోలీస్ స్టేషన్ సిబ్బంది,పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!