చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం బందార్లపల్లి గ్రామంలో లాంఛనంగా ప్రారంభమైన మెగా మెడికల్ క్యాంపు
* 43 రకాల రక్త పరిక్షలు, గుండె పరీక్షలు చేయించుకునేందుకు తరలి వచ్చిన జనం
* చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా 5 లక్షల మందికి ఆరోగ్య పరీక్షలు చేసే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి హాజరైన జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ
* ప్రివియా హెల్త్ సంస్థ వారి సహకారంతో గ్రామగ్రామాన జరుగుతున్న రక్త పరీక్షలు.
* 250 మంది సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది.
* జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పల్లెల్లో విజయవంతంగా కొనసాగుతున్న మెడికల్ క్యాంపులు.
*చెవిరెడ్డి స్పీచ్..*
* అందరికీ ఆరోగ్యవంతులుగా చూడటమే నా లక్ష్యం
* దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రగిరిలో మెడికల్ క్యాంపుల ద్వారా వైద్య పరీక్షలు చేయీస్తున్నాం.
* జిల్లా కలెక్టర్ సహకారంతో అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించి ఇబ్బంది ఉన్న వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తాం.
* ఒకటిన్నర సంవత్సరంగా ప్రయత్నిస్తే ఇప్పటికి ఆచరణలోకి తీసుకుని వచ్చాం.
* ప్రతి ఒక్కరూ ఓపికగా రక్త పరీక్షలు చేయించుకుంటే ప్రాణాంతక వ్యాదులను ముందస్తుగా గుర్తించవచ్చు.
* ఒక మహాయజ్ఞంలా చేపట్టిన. ఈ మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించి విజయవంతం చేయాలి.
* జిల్లా అధికారుల సమక్షంలో అన్ని శాఖల అధికారులు, తుడా అధికారులు అందరూ భాగస్వాములై పని చేస్తారు
* ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు చేయించి సమస్య ఉన్నట్లయితే 104 వాహనంలో ప్రతి నెలా మందులు పంపించేలా చర్యలు తీసుకుంటాం
* ప్రాణాపాయ పరిస్థితి వస్తే కార్పొరేట్ వైద్యం అందించే ఆసుపత్రిలో చేర్పించి ఆరోగ్య శ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందిస్తాం.
*జిల్లా కలెక్టర్ వాయిస్*
* దేశంలో ఎక్కడా లేని విధంగా 5 లక్షల మందికి వైద్య పరిక్షలు చేయించడం చెవిరెడ్డికి మాత్రమే సాధ్యం.
* అసాధ్యాలను సుసాధ్యం చేయగల శక్తి ఆయనకు మాత్రమే ఉంది.
* వ్యాధి నిర్ధారణ చేసుకుంటే మనకు తెలియని రోగాలకు సకాలంలో వైద్యం పొందే అవకాశం ఉంటుంది.
* ప్రాణాలపైకి తెచ్చుకోకుండా ముందస్తుగా రోగాలను గుర్తించుకునే గొప్ప అవకాశం ఎమ్మెల్యే చెవిరెడ్డి గ్రామాల్లో కల్పించారు.
* ప్రతి ఒక్కరూ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
జాయిన్ కలెక్టర్ డీకే బాలాజీ, తుడా కార్యదర్శి లక్ష్మీ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు, డీఎంహెచ్ఓ శ్రీహరి లు పాల్గొన్నారు.