విద్యార్థులకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 26, మహానంది:
మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని మండల పరిషత్ పాఠశాల మలుపు వద్ద విద్యార్థులకు త్రుటిలో తప్పిన పెను ప్రమాద సంఘటన బుధవారం చోటుచేసుకుంది.గురు రాజ పాఠశాల విద్యార్థుల బస్సు మరియు బాలాజీ పాఠశాలకు చెందిన విద్యార్థుల బస్సు ఎదురెదురుగా వస్తూ ఢీకొన్న ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు కానీ బస్సు యొక్క అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. మితిమీరిన వేగం వల్ల ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, నేడు స్వల్పంలో పెను ప్రమాదం తప్పిందని, లేకపోతే భారీ నష్టం చవి చూడాల్సి వచ్చేదని అక్కడి స్థానికులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మితిమీరిన వేగంతో కాకుండా స్వల్ప వేగంతో తగు జాగ్రత్తలతో వాహనాలు నడపవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు తెలిపారు.