*మార్షల్ ఆర్ట్స్ లో విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చిన అబ్బులు సేవలు అభినందనీయం.*
— ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల ఉచిత మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ విద్యార్థులకు ఆరోగ్యం, ఆత్మరక్షణపై అవగాహన కలిగిస్తున్న టైక్వాండో మాస్టర్ టి అబ్బులను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అభినందించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కొత్తపేట నియోజకవర్గం ఆలమూరులో ఆగి అబ్బులు వద్ద శిక్షణ పొందిన విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గుర్తింపు పొందిన టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు ఆరోగ్యానికి, ఆత్మ రక్షణకే కాకుండా క్రీడల్లో పాల్గొని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, క్రీడల్లో మంచి ప్రతిభ కనబరచి మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. మార్షల్ ఆర్ట్స్ గౌరవ అధ్యక్షులు చల్లా ప్రభాకర్ రావు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ నార్గని చంద్రకుమార్, తాతపూడి సందీప్ కిరణ్, మెరిపి సత్య కాంత్, ఖండవల్లి సత్యనారాయణ, టైక్వాండో విద్యార్థులు పాల్గొన్నారు.