స్వచ్ఛమైన జలసంపద నిలయం మహానంది దివ్య క్షేత్రం
శ్రీ మహానందీశ్వరుని దర్శనం సర్వపాపహరణం.. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 05, మహానంది:
మానవజన్మను సార్ధకత చేసుకొనుటకు ప్రతి ఒక్కరు శ్రీ మహానందీశ్వరుని దర్శనం చేసుకోవాలని, మహానందీశ్వరుని దర్శనం సర్వపాపహరణం అని
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం నంద్యాలలో మన గుడి మన బాధ్యత నిర్వహించిన కార్యక్రమంలో శ్రీమద్రామాయణ ప్రవచనాలు చెప్పటానికి వచ్చివ చాగంటి కోటేశ్వరరావు బుధవారం ఉదయం శ్రీమహానందీశ్వర స్వామివారిని
కామేశ్వరీ దేవి అమ్మవారి దర్శనార్థం మహానందికి రావడం జరిగింది. ముందుగా వీరిని ఆలయ, ఈవో చంద్రశేఖర్ రెడ్డి వేదపండితులుమంగళ వాయిద్యాల తో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆహ్వానించారు.అనంతరంస్వామి అమ్మవార్లకు అభిషేకము, కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు.తదనంతరము అలంకార మండపం నందు ఈవో చంద్రశేఖర్ రెడ్డి ,ఆలయ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి స్వామివారి శేష వస్త్రం, స్వామివారి చిత్రపటం ఇచ్చి ఆయనను సత్కరించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ మహానందీశ్వరుని దర్శనం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు.మహానందిలో స్వచ్ఛమైన జల సంపద ఎంతో అద్భుతం అని స్వయంభూ గా వెలసిన శ్రీ స్వామి వారు చాలా ప్రత్యేకమని స్వయంగా స్వామివారి వాహనమైనటువంటి నంది వెలసిన క్షేత్రమని ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించుకోవలసిన క్షేత్రం మహానంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
.