పదవ తరగతి విద్యార్థుల విషయంలో బిజెపి అవలంబిస్తున్న తీరుపై తీవ్రంగా మండిపడ్డ విద్యాశాఖ మంత్రి సబిథింద్రారెడ్డి

*పదవ తరగతి విద్యార్థుల విషయంలో బీజేపీ అవలంభిస్తున్న తీరుపై తీవ్రంగా మండిపడ్డ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు.*

*వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు,పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారు, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గార్లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.*

*విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దు,5 లక్షల మంది విద్యార్థుల,వారి పేరెంట్స్ ఉసురు బీజేపీ నాయకులకు తప్పక తగులుతుంది.*

*తప్పు చేసిన వారిని వెనుకేసుకొస్తూన్న బీజేపీ కేంద్ర నాయకత్వం ఇలాంటి సంఘటనలను ప్రోత్సహిస్తుందా*

*అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న తెలంగాణపై విషం కక్కుతూ ఇలాంటి సంఘటనలుకు పాల్పడితే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు.*

*నిన్న మధ్యాహ్నం పేపర్ లీకేజీ జరిగిందని బీజేపీ ధర్నా చేసింది…సాయంత్రం నిందితులను విడుదల చేయాలని మళ్లీ ధర్నా చేసింది బీజేపీ కి ఈ ఘటనతో సంబంధం ఉందని నిన్ననే తేలిపోయింది.*

*భాధ్యత గల ఎంపీ గా ప్రమాణం చేసిన సంజయ్ ఇలాంటి పేపర్ నీకు వాట్సప్ లో వచ్చినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం ని బాధ్యత కాదా?*

*ఇలా పేపర్ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల పేరెంట్స్,కుటుంబీకులను ఆందోళనకు గురి చేయటం సరైన పద్దతా?*

*నిధుల విషయంలో, అభివృద్ధి లో ,ప్రజా సమస్యల్లో పోటీ పడాలి కానీ వాటిలో ఎలాగూ సర్కార్ ను ఎదుర్కోలేక,సమస్యలు లేని తెలంగాణ లో మీ పార్టీ పాలిస్తున్న రాష్టాల్లో లాగా లీక్ లకు తెరలేపారా?*

*కేంద్రంలో ఇన్నేళ్ల మీ పాలనలో రాష్టానికి ఒక్క విద్యాలయం తెలేకపోయారు కానీ సరస్వతి నిలయంగా మారిన తెలంగాణ పై విషం కక్కుతారా?*

*ప్రశ్న పత్రాల కేసులో అడ్డంగా దొరికిపోయి మళ్ళీ మీ పార్టీ వాళ్ళను రోడ్లెక్కి ఆందోళనలు చేస్తారా?ప్రజలు మిమ్మల్ని సరైన సమయంలో బుద్ధి చెప్తారు.తెలంగాణ లో మీ పార్టీ గో బ్యాక్ అనే నినాదం వినిపిస్తుంది.*

*విద్యార్థులకు మీరు,మీ పార్టీ ఇస్తున్న సందేశం ఇదేనా….తప్పు చేసి మళ్ళీ బుకాయింపులా?*

*మీరు, మీ పార్టీ చేస్తున్న ఆందోళనలలో మీ పార్టీ నేతలు తప్ప ప్రజలెవరు పాల్గొనటం లేదంటే మీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందొ ఇట్లే అర్థం అవుతుంది.*

*తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావును రాజకీయంగా ఎదుర్కోలేక భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నాయకత్వంలో కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతుంది.*

*బీజేపీ అగ్రనాయకత్వం సూత్రధారులుగా జరుగుతున్న ఈ కుట్రలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ పాత్ర దారుడిగా వ్యవహరిస్తున్నాడు.*

*రాష్ట్రంలో అశాంతిని, అభద్రతను సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు భారతీయ జనతా పార్టీ కుయుక్తుల్ని, పన్నాగాలని పన్నుతోంది.*

*రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ పార్టీ. బీఆర్ఎస్‌ను బద్నాం చెయ్యటానికి ప్రయత్నిస్తుంది.*

*పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు టెన్త్ పేపర్ల లీకేజీలో బీజేపీ నాయకుల హస్తం ఉంది.*

*నిన్న జరిగిన పదవ తరగతి హిందీ పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు ప్రశాంత్.. బండి సంజయ్ అనుచరుడు. అందుకే పేపర్ లీక్ కాగానే ముందు బండి సంజయ్‌కు పేపర్ పంపాడు.*

*పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితుడైన రాజశేఖర్ రెడ్డి కూడా బండి సంజయ్ అనుచరుడని ఇప్పటికే స్పష్టమైనది.*

*లక్షల మంది పిల్లలు భవిష్యత్తు,వారి తల్లి తండ్రులు ఎంత బాధ పడతారు అని కనీస బాధ్యత లేకుండా బండి సంజయ్ ప్రవర్తించాడు.*

*ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ కి ఫోటో తీసిన పేపర్ ఫోన్లో పంపించాడు.*

*బండి సంజయ్,బీజేపీ వాళ్ళతో 140 సార్లు ఫోన్లో ప్రశాంత్ మాట్లాడారు.*

*బండి సంజయ్ పాత్ర ఉన్నది. పోలీసుల వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి..చట్టం తన పని తాను చేసుకుపోతుంది.*

*విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బీజేపీ కుట్రలను గమనిస్తున్నారు.*

*తాండూరు లో లీకేజీ కి పాల్పడ్డ టీచర్ బీజేపీ ఉపాధ్యాయ సంఘం లో ఉన్నారు.*

*పదో తరగతి ప్రశ్నా పత్రం వాట్సాప్ లో ప్రచారం చేసిన ప్రశాంత్ బీజేపీ కార్యకర్త కాదా బండి సంజయ్ స్పష్టం చేయాలి.*

*విద్యార్థుల జీవితాల తో ఆడుకునే వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదు*

*ముగ్గుర్ని ప్రభుత్వ ఉద్యోగులను సర్వీస్ నుండి తొలగించి చర్యలు తీసుకున్నాం.భవిష్యత్తు లో ఎవరు ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డ కఠిన చర్యలు ఉంటాయి,ఎవరున్నా ఉపేక్షఉంచబోము.*

*చట్టం ఎవరికైనా ఒక్కటే బండి సంజయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలి.*

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!