*అణగారిన వర్గాల గొంతుక బాబూ జగ్జీవన్ రామ్.*
— ఏపి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్,యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి…
_అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని,దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్,రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేసిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలలో భాగంగా కొత్తపేట శాసనసభ్యులు ప్రభుత్వ విప్,చిర్ల జగ్గిరెడ్డి,గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు ద్వారంపూడి నాగేంద్ర సత్యనారాయణ రెడ్డి,గ్రామ సర్పంచ్ కట్టా శ్రీనివాస్,ఉప సర్పంచ్ నాండ్ర నాగ మోహన్ రెడ్డి,తాడి మెహర్ ఆదిత్య రెడ్డిల చొరవతో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ముందుగా జగ్జీవన్ రామ్ శిలావిగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ 1952 నుండి వరుసగా 8సార్లు పార్లమెంట్ సభ్యుడిగా,సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా పనిచేశారని దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అలాగే చిర్ల మాట్లాడుతూ పేద వర్గాల అభ్యున్నతి కోసం జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారన్నారని, ఎన్నో పదవులు సుదీర్ఘకాలం అనుభవించిన చాలా నిరాడంబర జీవితం గడిపారాని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన మహనీయుడని వారు కొనియాడారు. అనంతరం జొన్నాడ మాజీ గ్రామ సర్పంచ్ స్వర్గీయ గొలుగూరి భాస్కర్ రెడ్డి అల్లుడైన సత్తి సోమిరెడ్డి నూతనంగా మండపేటలో ప్రారంభిస్తున్న *సహస్ర ఫ్యామిలీ రెస్టారెంట్* వద్దకు భారీ ర్యాలీగా తరలి వెళ్లి నూతన వ్యాపార అభివృద్ధిని ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్, చెముడులంక గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్,గ్రామ అరుంధతి యువజన సంఘం ప్రెసిడెంట్ లంక కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ తాతపూడి రమేష్,సంఘ పెద్దలు చాపల రవిరాజు, లంక బాలకృష్ణ, చాపల బాలకృష్ణ, తాతపూడి లక్ష్మణరావు,లంక రాజు,చాపల వీర్రాజు, చాపల ఆశీర్వాదం, సత్తల చాలా బంద్ రాజు గ్రామ నాయకులు యువత, తదితరులు పాల్గొన్నారు._