ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు
స్టూడియో 10 టీవీ న్యూస్ ఏప్రిల్ 03,మహానంది:
మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సోమవారం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 167 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 148 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని, క్రీస్తుజ్యోతి పాఠశాలలో 155 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 145 మంది హాజరయ్యారని చీఫ్ సూపరింటెండెంట్స్ జి .మోహన్ రెడ్డి, ఎస్వి .రవణమ్మ తెలిపారు.దూరప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉదయం 9 గంటలకు విద్యార్థులంతా పరీక్షా కేంద్రాల్లోకి చేరుకున్నారు.మొదటిరోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగింది.పరీక్షలు జరిగే సమయంలో పాఠశాలలను తహసీల్దార్ జనార్దన్ శెట్టి పర్యవేక్షించారు.పరీక్ష కేంద్రాల వద్ద మహానంది ఎస్సై నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు.