చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం

చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం

స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 03, మహానంది:

చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ లలితమ్మ తెలిపారు. సోమవారం మహానంది మండలం తాహసిల్దార్ కార్యాలయంలో చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు, మొక్కజొన్న,అలసందలు, పెసలు వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పూర్వీకులు పోషకాహారం తీసుకోవడంతో ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నారని, ప్రభుత్వం అందించే చిరుధాన్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తాహసిల్దార్ జార్దన్ శెట్టి, ఎంపీడీవో శివ నాగజ్యోతి, డిప్యూటీ తహసిల్దార్ నారాయణరెడ్డి, డిప్యూటీ సర్వేయర్ కామేశ్వర్ రెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ కలవతమ్మ, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!