భక్తుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు-ట్రస్టు బోర్డు ఛైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 03, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ పరిసరాల్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని మహానంది ట్రస్టు బోర్డు ఛైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి తెలిపారు.ఆలయ ముందు భాగంలో సోమవారం పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఛైర్మెన్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం క్షేత్రానికి భక్తులు స్వామీ అమ్మవార్ల దర్శనం కోసం చాలా దూరం ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు క్షేత్రానికి వస్తుంటారని, ఆ భక్తులకు వేసవి కాలం ఎండ వేడికి దాహార్తి తీర్చేందుకు పాలక మండలి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం మంచి పరిణామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు,ఆలయ సిబ్బంది , గ్రామస్తులు పాల్గొన్నారు.