చికిత్స పొందుతూ యువకుడు మృతి

చికిత్స పొందుతూ యువకుడు మృతి

స్టూడియో 10 టీవీ న్యూస్ ఏప్రిల్ 02, మహానంది:

క్రిమి సంహారక మందు తాగి యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.
మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన డి.నాగేశ్వరరావు (25) అనే యువకుడు మధ్యంలో క్రిమిసంహారక మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే వారి కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం మృతుడు మద్యానికి బానిసై తల్లికి డబ్బులు అడగక ఇవ్వకపోవడంతో కోపంలో రెండు రోజుల క్రితం మద్యంలో క్రిమిసంహారక మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. మహానంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!