పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి
మండల విద్యాశాఖ అధికారి రామసుబ్బయ్య
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 02, మహానంది:
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని మండల విద్యాశాఖ అధికారి రామసుబ్బయ్య ఆదివారం తెలిపారు.మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల మరియు క్రీస్తు జ్యోతి పాఠశాలలో పదవ తరగతి పరీక్షల కొరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసామన్నారు.ఈ ఆయన మాట్లాడుతూ పరీక్షలు ఉదయం 9.30 నుండి 12.45 వరుకు పరీక్షలు జరుగుతాయని,కావున అందరూ తప్పకుండా పరీక్షా కేంద్రానికి ముందుగా చేరుకొని ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాశేలా అన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు. మండలంలోని ఈ సంవత్సరం 457 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారని వారిలో గాజులపల్లె లోని జిల్లా పరిషత్ పాఠశాలలో 166 మంది రెగ్యులర్ ,18 మంది సప్లిమెంటరీ పరీక్షలు రాయనుండగా, స్థానిక క్రీస్తు జ్యోతి పాఠశాలలో 154 మంది రెగ్యులర్, 12మంది సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నారని, మిగిలిన 107 మంది విద్యార్థులు నంద్యాలలోని పలు పాఠశాలల్లో పరీక్షలు రాస్తున్నట్లు తెలియజేశారు.క్రీస్తు జ్యోతి పాఠశాల కరస్పాండెంట్
షిధిన్ శామ్యూల్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలుశప్రశాంత వాతావరణంలో రాశేలా అన్ని ఏర్పాట్లు చేసామని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మన్నారు.