*పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత..*
*స్వచ్ఛ మషాల్ మార్చ్ అవగాహన కార్యక్రమం ర్యాలీని ప్రారంభించిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ *
మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అందరం ఆరోగ్యంగా ఉంటాము, పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని *వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్* గారు అన్నారు. ఈరోజు చైర్ పర్సన్ గారి సొంత వార్డు, 25వ వార్డులో తడి – పొడి, హానికరమైన చెత్తను వేరు చేసి చెత్త బండిలో వేయాలని, అలాగే ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించి జ్యుట్ బ్యాగులు, సంచులు వాడాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ *స్వచ్ఛ మషాల్ మార్చ్ ర్యాలీ* చేపట్టడం జరిగింది.
ఈ ర్యాలీని ప్రారంభించిన *వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్* అందరి చేత ప్రతిజ్ఞ చేయించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ.. వికారాబాద్ పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచడం ప్రజలందరి బాధ్యత అని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, మహిళ స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, 25వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.