టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి “వీర్లపల్లి శంకర్”
ఎనిమిదేళ్లుగా ఏం చేయలేదంటూ గిరిజనుల ఆవేదన..!
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికలు
కుల్చర్లకుంట తండా, గుట్ట వెనికి తండా, కడియాల కుంట తండా, వాచ్య తండాల నుంచి చేరికలు
“వీర్లపల్లి శంకర్” ఆధ్వర్యంలో పార్టీలో చేరిన గిరిజనులు
షాద్ నగర్, : వచ్చే ఎన్నికల్లో షాద్ నగర్ నియోజక వర్గంలో గెలిచేది, ప్రజల్లో నిలిచేది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ దీమ వ్యక్తం చేశారు. శనివారం షాద్ నగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో 32 మంది గిరిజన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఫరూక్ నగర్ మండలం కుల్చర్లకుంట తండా, గుట్ట వెనికి తండా, కడియాల కుంట తండా, వాచ్య తండాల నుంచి చేరికలు జరిగాయి.
ఈ సందర్భంగా గిరిజన నాయకులు తావురియా నాయక్, హర్యా నాయక్, కొర్ర ఢాక్యా, రాజు, సంజు, దిలీప్, కొర్ర పవన్, రాజ్ కుమార్, లక్ష్మణ్, రమేష్, దాక్య, శంకర్, బాధవత్ వెంకట్యా, బాలు, సంతోష్ తదితరులు పార్టీలో చేరారు ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ పలువురికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఏర్పాటు అయిన సమావేశంలో శంకర్ మాట్లాడుతూ.. గిరిజనులకు, పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని గత ఎనిమిదేళ్లలో గిరిజన నాయకులు చెప్పినట్లు తాండాలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు. గత ఎనిమిదేళ్ల కాలంలో తాండాల ప్రజల బాగోగులు చూసిన పాపాన పాలకులు పోలేదని విమర్శించారు. అదేవిధంగా పార్టీలో చేరిన తాండ నాయకులు మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లలో తమను ఎవరూ పట్టించుకోలేదని టిఆర్ఎస్ పార్టీలో విసిగివేసారి పార్టీని వీడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ తండాలవైపు కన్నెత్తి కూడా చూడలేదని, గత ఎనిమిదేళ్లుగా ఎంతో నరకం అనుభవించామంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరి బెదిరింపులు, భయాందోళనలు రేకెత్తించినా కాంగ్రెస్ పార్టీని వీడబోమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆగిర్ రవికుమార్ గుప్తా, తుపాకుల శేఖర్, సీతారాం, అశోక్ తదితరులు పాల్గొన్నారు..