స్వచ్చోత్సవ్ లో భాగంగా తేది.31.03.2023 నాడు వార్డ్ నెంబర్ 19, 28 లలో స్వచ్ఛత మషాల్ మార్చ్ ర్యాలీలలో పాల్గొన్న మునిసిపల్ కమిషనర్ శ్రీ.శరత్ చంద్ర గారు, వార్డు కౌన్సిలర్ శ్రీమతి.స్వాతి రాజ్ కుమార్ గారు రిసోర్స్ పర్సన్లు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు మరియు యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు మరియు యువజన సంఘాల సభ్యులచే స్వచ్ఛతపై మరియు పరిసరాలను శుభ్రంగా మరియు పచ్చగా ఉంచుకుంటానని, రోడ్లు, వీధులలో మరియు చుట్టుపక్కల చెత్తను వేయకూడదని మరియు నగరంలో చెత్త లేకండా ఉంచడానికి అవగాహన కపలిస్తానని, SHG గ్రూప్ సభ్యులకు 3 బిన్ వ్యర్ధాలను వేరుచేయడం మరియు ఇంటిలో కంపోస్టింగ్ ని అమలుచేయిస్తానని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తాను మరియు గుడ్డసంచులను మాత్రమే ఉరయోగిస్తానని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.