*భారతీయ జనతా పార్టీ మొదటిసారి అధికారంలోకి రాకంటే ముందు కేంద్రంలో మేము గనుక అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మాదిగలకు సామాజిక న్యాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన బిజెపి నిర్లక్ష్యానికి నిరసనగా*
*అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ అంశం లేవనెత్తకుండా అర్ధాంతరంగా సమావేశాలను ముగించడo
షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై గతం నుంచి ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలలో కమిటీలను వేసి ఆ కమిటీల నివేదికలు కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చినప్పటికీ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రాజకీయ పార్టీల వైఖరి కూడా ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి లెటర్ ఇచ్చినప్పటికీ ఆనాడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బిజెపి పార్టీ ప్రతిపక్షంలో ఉండి అప్పటి నుంచే మేము ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలమని చెప్తూ వచ్చి తీరా మేము గనుక అధికారంలోకి వస్తే ఏ సిద్ధాంతం అయితే బిజెపి మూల సిద్ధాంతం అని చెప్పుకునే మీరు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు సూచించిన అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం అట్టడుగు స్థాయినున్నవారికి ప్రతిఫలాలు అంది అసమానతలు లేని సమాజాన్ని చూడాలని సిద్ధాంతమని చెప్పుకునే మీరు ఎక్కడ కూడా ఆ సిద్ధాంతానికి కట్టుబడి లేరు అని మీయొక్క పాలన నిర్లక్ష్యం మోసపూరితంగా ఉన్నదని తేటతెల్లమైంది
అంతేకాకుండా జనావదమాస ప్రకారం రిజర్వేషన్లు పంచకుండా రిజర్వేషన్లను దోచుకొని తినే దోపిడి వర్గాలకు భయపడి వత్తాసు పలుకుతున్న బిజెపి పార్టీది పిరికి చర్యగా మహాజన సోషలిస్టు పార్టీ భావిస్తుంది.
ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల అభివృద్ధి బాగోగులు చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదే అని మరచిపోయిన బిజెపి పార్టీ వైఖరికి నిరసనగానే ఈ జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేసి జిల్లా కలెక్టర్ గారి ద్వారా మా విన్నపాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి వచ్చే అకాడమిక్ ఇయర్ లోపే ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చేసి షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి 59 కులాల విద్యార్థుల భవిష్యత్తును చక్కతిద్దాల్సిన బాధ్యత ఎస్సి వర్కర్ ను చేసి వారికి న్యాయం చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ దేనని మేము గుర్తు చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున్ మాదిగ మహాజన సోషల్ లిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు స్వామిదాస్ మాదిగ మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కోకారున్నారు రవి మహాజన సౌశీలించి పార్టీ తాండూరు మండల ఇన్చార్జి నర్సింలు మహాజన సోషలిస్టు పార్టీ యాలాల్ మండల ఇన్చార్జి మహేందర్ మహిళా నాయకురాలు పుష్ప రాణి మహాజనటి పార్టీ పట్టణ ఇన్చార్జి మల్లేష్ ఎమ్మార్పీఎస్ నాయకులు బొమ్మరాజ్ పెట్ మండల ఇన్చార్జి సుభాష్ మరో ఎమ్మార్పీఎస్ కొడంగల్ నియోజకవర్గం ఇన్చార్జి మల్కప్ప కొడంగల్ మండల ఇన్చార్జి అంజి యలాల్ మండల నాయకులు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.