*వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ గారి అధ్యక్షతన ప్రవేశపెట్టిన రూ.50 కోట్ల అంచనా బడ్జెట్..*
*ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు…*
*ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ గారు..*
వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ గారి అధ్యక్షతన ఈరోజు 2023 – 24 సంవత్సరానికి గాను రూ.50 కోట్ల పైచిలుకు అంచనా బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ బడ్జెట్ ను కౌన్సిల్ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కిందిస్థాయి వరకు చేరేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా కృషి చేయాలని కోరారు.
బడ్జెట్ సమావేశం అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ గారు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కౌన్సిల్ సభ్యులు అందరూ ఏకగ్రీవ తీర్మానంతో 2023 – 24 సంవత్సరానికి గాను రూ.50 కోట్ల 39 లక్షల 32వేల అంచనా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఈ బడ్జెట్ ను ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ బడ్జెట్ లో పన్నుల రూపంలో వచ్చేవి రూ.9 కోట్ల 54 లక్షలు అని అంచనా వేయడం జరిగింది. అలాగే నాన్ టాక్సెస్ రూ.9 కోట్ల 75 లక్షల 32 వేలు, డిపాజిట్లు, లోన్ ల రూపంలో వచ్చేవి రూ.90 లక్షలు, గ్రాంట్స్ రూ.30 కోట్ల 20 లక్షల గ్రాంట్స్ రావచ్చునని అంచనా వేయడం జరిగిందని చైర్ పర్సన్ గారు తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం, కమిషనర్ శరత్ చంద్ర, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.