*ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు ఆధార్ తప్పనిసరి.*
— ఎంపీడీవో కే.జాన్ లింకన్..
*_అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా వారి ఆదేశాల మేరకు ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో శుక్రవారం ఎంపీడీవో కే.జాన్ లింకన్ ఆధ్వర్యంలో ఆలమూరు సెక్టార్ పరిధిలో అందరూ అంగన్వాడీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 0 నుండి 6 సంవత్సరాలలోపు చిన్నారులకు ఆధార్ తప్పనిసరి అని,శిశువు పుట్టిన తొలి రోజు నుంచే ఆధార్ కార్డు పొందవచ్చునని ఇందుకోసం జనన ధ్రువీకరణ పత్రం అవసరం.ఈ సర్టిఫికెట్‌ను పిల్లలు పుట్టిన ఆస్పత్రిలోనే అందజేస్తారని కొన్ని హాస్పిటల్స్ అయితే బర్త్ సర్టిఫికెట్‌తో పాటు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ దరఖాస్తు పత్రాన్ని కూడా అందిస్తున్నాయని తెలియజేసి,అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు అనుబంధ పోషక ఆహారం అందించే సమయంలో ఆన్లైన్ ప్రక్రియ ద్వారా నమోదు చేయవలసి ఉండగా ఆధార్ నమోదు లేకపోవడంతో ఆన్లైన్లో పేర్లు చూపించడం లేదని కావున ప్రతి అంగన్వాడీ కార్యకర్తలు కూడా చంటి బిడ్డ తల్లులకు సరైన రీతిలో అవగాహన కల్పించి చిన్నారులకు ఆధార్ నమోదు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చిక్కాల వీరమాత, ఆలమూరు సెక్టార్ సూపర్వైజర్ టీఎన్వి.లక్ష్మి, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు._*