రజకులను ఎస్సీలుగా అసెంబ్లీ లో బిల్లు ప్రవేశ పెట్టాలి.-ఏపి రజక ఎస్సీ సాధన చైతన్య సమితి రాష్ట అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు డిమాండ్
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 29,నంద్యాల:
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి రజకులకు ఎటువంటి ప్రత్యామ్నాయ అభివృద్ధి లేక సమాజంలో ఎన్నో అవమానాలు ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్న దుస్థితి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్నామని “ఏపీ రజక ఎస్సీ చైతన్య సాధన సమితి” రాష్ట్ర అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బుధవారం స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం వెనుక నిశాంతి భవన్ ఆవరణలో ఏపి రజక ఎస్సీ సాధన చైతన్య సమితి ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమంలో ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రజకులకు ఎన్నో హామీలు ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత రజకుల అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కూడా నోచుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రజకుల ముఖ్యమైన డిమాండ్ల కోసం రజక ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి రజకుల యొక్క ముఖ్య డిమాండ్లు, చట్టసభల్లో రజకులకు ప్రత్యేక స్థానం కల్పించి ,అలాగే రజకులను చాలా రాష్ట్రాల్లో రజకులను ఎస్సీలుగా గుర్తించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎస్సీలుగా గుర్తించి ఎస్సీ ఎస్టీ తరహాలో రజకులకు ప్రత్యేక రక్షణ చట్టం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి నంద్యాల జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ పేరుమీద కమ్యూనిటీ హాలును నిర్మించాలని, అలాగే చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రజక యువకులకు ప్రత్యామ్నాయ అభివృద్ధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా వడ్డీ లేని రుణాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన ప్రతి రజక పురుషులకు, మహిళలకు ప్రతినెల 5000 వేల రూపాయలు ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని, అదేవిధంగా ప్రతి గవర్నమెంటు హాస్పిటల్ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో బట్టలు ఉతికే పనులను రజకులకే అప్పగించాలని, ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా రజక ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రజక విద్యార్థి యువజన(RSYF) రాష్ట్ర అధ్యక్షులు డి.చిన్న, జిల్లా నాయకులు చిన్న శ్రీనివాసులు, ఆంజనేయులు, వెంకటరమణ, బయటిపేట శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు