మహానందిషుని హుండీ ఆదాయము రూ.23 లక్షల 53వేలు.
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 29,మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలో ఉభయ దేవాలయముల హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం నాడు ఆలయంలోని అభిషేక మండపంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, పాలకమండలి చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ ఉభయ దేవాలయంల హుండీ ల ద్వారా ఆలయానికి 23 లక్షల 53 వేల 504రూపాయలు ఆదాయం వచ్చినట్లుగా తెలిపారు. ఈ లెక్కింపు ద్వారా ఉభయ దేవాలయంల నుండి హుండీ ఆదాయం 22లక్షల 95వేల48 రూపాయలు మరియు అన్నదానం హుండీ ద్వారా40వేల56 రూపాయలు మరియు గోశాల హుండీ ద్వారా18వేల400 రూపాయలు ఆదాయం వచ్చినట్లుగా తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ తరపున ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, మహానంది ఆలయ అధికారులు,సిబ్బంది, పాలకమండలి సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.