*మహిళా అభివృద్ధి సంక్షేమమే సీఎం జగన్ ఆకాంక్ష.*
— కొత్తపేట శాసనసభ్యులు ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి..
— ఘనంగా మండల నాయకుల ఆధ్వర్యంలో వైయస్సార్ ఆసరా కార్యక్రమం..
*_మహిళల ఆర్థికాభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. మండల కేంద్రమైన ఆలమూరు శివారు కొత్తూరు సెంటర్ వద్ద ఉన్న ఎస్.జె.ఆర్ ఫంక్షన్ హాల్ నందు మండల స్థాయిలో మూడవ విడుత వైఎస్సార్ ఆసరా పధకం క్రింద 15.65 కోట్ల మెగా చెక్ పంపిణీ కార్యక్రమం బుధవారం చిర్ల ప్రారంభించడం జరిగింది. ఈ సమావేశానికి ఎంపిపి తోరాటి లక్ష్మణరావు అధ్యక్షత వహించగా శాసనసభ్యులు ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మండల నాయకులు,అధికారులు ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేసిన సభలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి మూడవ విడత రుణమాఫీ మొత్తాన్ని విడుదల చేసిన సీఎం జగన్ చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు.ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో మహిళల అభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు.రాజకీయ ప్రాధాన్యత నుంచి అన్ని ప్రభుత్వ పథకాలను మహిళలకే చెందేలా సీఎం తీసుకున్న నిర్ణయం ఆదర్శంగా నిలుస్తోందని,ముఖ్యంగా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పరితపించే పాలకులు ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి ముఖ్యమంత్రిని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలన్నారు. 25 ఏళ్ళు అధికారం కొనసాగించిన ప్రభుత్వాలు కూడా చేయలేని సంస్కరణలను ఇప్పుడు ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని, రుణాలు మాఫీ చేస్తానని 2014లో చంద్రబాబు హామీ ఇచ్చి మహిళలను మోసం చేశారన్నారు. సీఎం జగన్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం క్రమం తప్పకుండా ఆలమూరు మండలంలో మూడు విడుతలుగా వైఎస్‌ఆర్ ఆసరా ద్వారా 45.47 కోట్లు రుణమాఫీ చేసి మాట నిలుపుకున్నారన్నారు. రాజకీయాల్లో కొనసాగుతున్నప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడడం ముఖ్యమని, అటువంటి నైజం కలిగిన సీఎంను ప్రజలు మరోసారి దీవించి సీఎంను చేయాలని ఎమ్మెల్యే చిర్ల కోరారు. అలాగే మండల నాయకులు మాట్లాడుతూ అప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు అన్ని విధాలా మొదటి ప్రాధాన్యత కల్పించారని మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించడంతోపాటు కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో కూడా ప్రభుత్వ పథకాలు ఎంతగానో తోడ్పడుతున్నాయని,వైఎస్సార్ ఆసరా ద్వారా మండలంలో మూడు విడతల్లో ఇప్పటి వరకు 1652 స్వయం సహాయక(పొదుపు) సంఘాలకు గాను 45.47 కోట్ల రూపాయలను లబ్థిదారులకు పంపిణీ చేశామన్నారు.తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఆర్థిక పరిపుష్టిని సాధించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తోరాటి సీతామాలక్ష్మి రాంబాబు,వైయస్సార్సీపి మండల కన్వీనర్, చెముడులంక గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్, వైయస్సార్సీపి రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు,మాజీ జడ్పీటీసీ సాకా ప్రసన్న కుమార్,కర్రి నాగిరెడ్డి, పెదపళ్ల పిఎసిఎస్ అధ్యక్షులు నెక్కంటి వెంకట్రాయుడు(బుజ్జి), వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ యనమదల నాగేశ్వరరావు,పలు శాఖల అధికారులు, గ్రామ సర్పంచులు,ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు,గ్రామ కన్వీనర్లు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు._*