ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి- సీఐటీయూ

ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి- సీఐటీయూ

స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 29, మహానంది:

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5వ తేదీన చలో ఢిల్లీ లోని జంతర్ మంతర్ దగ్గర జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు ,వ్యవసాయ, కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం మహానంది మండలంలోని తమ్మడపల్లె, బుక్కాపురం,తిమ్మాపురం ,మహానంది, గాజులపల్లె గ్రామాల్లో జీపు ద్వారా కరపత్రాలు వంచుతూ ప్రచారం ప్రచారంలో భాగంగా ఆ గ్రామాల్లో జరిగినటువంటి సభల్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ సిఐటియు జిల్లా కార్యదర్శి బి బాల వెంకట్ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ మార్కులు సిఐటియు మండల కార్యదర్శి కే సోమన్న ఆశ యూనియన్ జిల్లా నాయకురాలు భారతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి కార్మికులను యాజమాన్యానికి కట్టు బానిసలుగా మారుస్తూ ఆదాని అంబానీ బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నా మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్ మంతర్ లో ఐదు లక్షల మందితో ధర్నా నిర్వహించాలని ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయని అందులో భాగంగానే ఈరోజు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జీపు జాత నిర్వహించడం జరుగుతుందని వారన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరకు పార్లమెంట్లో చట్టం చేయాలని 2022 విద్యుత్ సంస్కరణల బిల్లు రద్దు చేయాలని, వ్యవసాయ పంపు చెట్లకు మీటర్లు రద్దుచేసి ఉచిత కరెంటును కొనసాగించాలని, నంద్యాల జిల్లాలో పెండింగ్లో ఉన్న జూలదొరసి రాజోలు ప్రాజెక్టు నిధులు కేటాయించి పూర్తిచేయాలని సిద్దేశ్వరం దగ్గర ఉన్న కృష్ణా నదిపై బ్రిడ్జి ఆనకట్ట నిర్మించాలని, రైతులు కవులు రైతులు వ్యవసాయ కూలీలకు నెలకు 5000 పింఛన్ సౌకర్యం కల్పించాలని, అర్హులైన పేదలందరికీ భూ పంపిణీ చేపట్టాలని ఢిల్లీ ఉద్యమ సందర్భంగా రైతులపై పెట్టిన కేసులు అన్నిటిని ఉపసంహరించుకోవాలి అనీ సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమం లో నంద్యాల జిల్లా నుండి కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు‌.ఈ కార్యక్రమంలో సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘం పాల్గొన్నారు

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!